AMARAVATHIHYDERABAD

కొన్ని పార్టీలు ఎన్నికలకు ముందు నుంచే అబద్దపు ప్రమాణాలు చేస్తున్నాయి జాగ్రత్త-ప్రధాని మోదీ

కొన్ని పార్టీలు ఎన్నికలకు ముందు నుంచే అబద్దపు ప్రమాణాలు..
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఏదైన ఎన్నికల వాగ్దనం చేసిందంటే అది నెరవేర్చితీరుతుందని,,కొన్ని పార్టీలు ఎన్నికలకు ముందు నుంచే అబద్దపు ప్రమాణాలు చేస్తున్నాయని,, బీజేపీ అలాంటి ప్రమాణాలు చేయదని, రేషన్ ఇస్తామని చెప్తే ప్రతి ఇంటికీ రేషన్ బియ్యం వచ్చి చేరుతున్నాయని, ఆయుష్మాన్ భారత్ ఇస్తామని చెప్తే దేశంలోని కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..శనివారం వరంగల్ వేదికగా జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభిస్తూ భద్రాకాళీ అమ్మవారి మహత్యానికి, సమక్క-సారలమ్మ పౌరుషానికి, రాణి రుద్రమ పరాక్రమానికి ప్రఖ్యాతి గాంచిన వరంగల్ కి రావడం సంతోషంగా ఉందన్నారు..
కాజీపేట అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ పరిశ్రమ, పీవోహెచ్ లకు, జాతీయ రహదారులతో కలిసి మొత్తం రూ.6,109 కోట్ల అభివృద్ధి పనులకు సభా వేదిక నుంచి ప్రధాని శంకుస్థాపన చేశారు..అనంతరం విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు..కేసీఆర్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు..తెలంగాణను బీఆర్ఎస్ నేతలు అవినీతి మయం చేశారు..అవినీతి లేని ఒక్క ప్రాజెక్టు కూడా లేదు..కేసీఆర్ ప్రభుత్వం సమాన్యులు ఊహించలేనంత అవినీతికి పాల్పడిందని ప్రధాని ఆరోపించారు..బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చింది, ఇంటికో ఉద్యోగం ఇస్తామని అన్నారు. అన్ని పగి కలలుగానే మిగిపోయాయి. తొమ్మిదేళ్లు అవుతుంది.. ఏమైంది మీ హామీ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ స్కాం గురించి అందరికీ తెలిసిందే. తెలంగాణ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తోంది? కేసీఆర్ సర్కార్ ఆ ఉద్యోగాలను తెలంగాణ నేతల జేబులు నింపుకోవడానికి వాడుకున్నారు. ఇది విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ చేస్తున్న ద్రోహం కాదా అని మోదీ ప్రశ్నించారు..ఢిల్లీ నుంచి హకీంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ తమిళ్ సై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలు స్వాగతం పలికారు..అక్కడి నుంచి ఏంఐ ప్రత్యేక విమానంలో ప్రధాని వరంగల్ కు చేరుకున్నారు.
BJP’s election promises will be fulfilled-PM Modi-hyderabad news.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *