AMARAVATHIDEVOTIONALNATIONAL

అంగరంగ వైభవంగా బాలరామయ్య ప్రాణ ప్రతిష్ట

ప్రధాని మోదీ చేతుల మీదుగా..
అమరావతి: వేల సంవత్సరాల హిందు సంస్కృతి,సంప్రదాయలకు ప్రతి రూపం అయిన కౌసల్య రాముడు,, అయోధ్యలో కొలువుతీరాడు.. బాలరామయ్య విగ్రహాన్ని కొత్తగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్టించారు..ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట,, సోమవారం మధ్యాహ్నం అభిజిత్ లగ్నం’లో 12.29 నిమిషాలకు ముఖ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు..దాదాపు 84 సెకన్ల పాటు ముఖ్యమైన క్రతువును చేపట్టారు.. ప్రాణ ప్రతిష్టాపన అనంతరం శ్రీరాముడి విగ్రహం కన్నులకు ఉన్న వస్త్రాన్ని ప్రధాని మోదీ తొలగించి,,పుష్పాలతో రామున్ని పూజించారు..ముందుగా ప్రధాని మోదీ రాముడికి హారతి ఇచ్చారు..ప్రాణ ప్రతిష్ట సమయంలో 50 శంఖాలు పూరించారు..స్వర్ణాభరణాలతో బాలరాముడు ధగధగా మెరుస్తూ దర్శనమిచ్చారు..కుడిచేతిలో బాణం, ఎడమచేతిలో విల్లుతో అభయమిచ్చారు..గర్భగుడి పూజలు ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్,,యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.. ప్రాణ ప్రతిష్ట తరువాత శుక్ల యజుర్వేదంకు చెందిన హోమం,,పారాయణం జరగనున్నది..ఆనంతరం సాయంత్రం పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది..
మనోహరమైన దర్శనం:- రామమందిరంలో సోమవారం ఉదయం రామ్ లల్లాను మంత్రోచ్ఛరణతో నిద్ర లేపారు..వైదిక మంత్రాలు మంగళా సాసనం పాడారు.. ఉదయం 10 గంటల నుంచి ప్రాణప్రతిష్టకు చెందిన పూజలు ప్రారంభం అయ్యాయి.. ఒకవైపు గర్భగుడిలో బాలరాముడి మూర్తికి పూజలు,, మరో వైపు యజ్ఞశాలలో హవనం సాగింది..రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారం గానం మారుమోగింది.. పీతాంబర వస్త్రాల్లో బాలరాముడు మనోహరంగా దర్శనమిస్తున్నాడు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *