లింగ నిర్ధారణ పరీక్షలు చేసే సెంటర్స్ పై స్ట్రింగ్ ఆపరేషన్-కలెక్టర్-వెంకటరమణారెడ్డి

భ్రూణహత్యలను నివారించండి..
తిరుపతి: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నేరమని ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి తెలిపారు.శనివారం స్థానిక కలెక్టరేట్ లోనే సమావేశ మందిరంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… సమాజం లో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అని లింగ వివక్ష ఉండ కూడదు అని తెలిపారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్ట ను కటినంగా అమలు చేయడం ద్వారా భ్రూణ హత్య లను నిర్మూలించవచ్చన్నారు. ప్రస్తుతం రాష్ట్రoలో 0-6 సంవత్సరాల బాలల లింగ నిష్పత్తి 2001లో 961 ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారం నిష్పత్తి 1000::943 మాత్రమే ఉన్నదని ఈ సంఖ్య క్రమేపి తగ్గిపోతే భవిష్యత్తులో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుందని తెలిపారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడుతున్న స్కానింగ్ సెంటర్ల వారి రిజిస్ట్రేషన్ తొలగించడం,,క్రిమినల్ కేసులు నమోదు చేసి తొలిసారి రూ.10 వేల రూపాయలు జరీమానతో పాటు 3 సంవత్సరాల కఠినమైన శిక్షలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో 185 స్కానిగ్ సెంటర్స్ ఉన్నాయనీ తెలిపారు. జిల్లాలో కొన్ని మండలాలలో లింగ నిష్పత్తి చాలా తక్కువ శాతంలో ఉందని అలాంటి మండలాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. అనుమానం ఉన్న స్కానింగ్ సెంటర్ లపై స్ట్రింగ్ ఆపరేషన్ ను కఠినంగా అమలు చేస్తే తప్ప గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేసే చర్యలకు పాల్పడరని తెలిపారు. క్షేత్ర స్తాయిలో అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీ స్త్రీల ఆరోగ్యమును పర్యవేక్షిస్తుంటారని జిల్లా స్థాయి లింగనిర్ధారణ కమిటీలో ICDS అధికారులను చేర్చాలని తెలియజేసారు. కావున ప్రజలలో గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టంపై అవగాహన పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో N.C.D.R.B.S.K డా. హర్షవర్ధన్, Addl. DM&HO శాంతకుమారి,,డా.కిరిటి, DSP రామరాజు, దిశా SI అరుణ, గైనకాలజిస్ట్ డా.మధులిక,S.O రమేష్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటనారాయణ , లీగల్ అడ్వైసర్ ఇంద్రాణి, డెమో జయరాం N.G.O సభ్యులు తదితరులు పాల్గొన్నారు.