హైదరాబాద్: తెలంగాణలో వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో వుంచుకుని,,బీజేపీ అధిష్టానం తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే నిర్ణయాల్లో భాగంగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ను మార్చింది..తరుణ్ చుగ్ స్థానంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ను నియమించింది..ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు..సునీల్ బన్సల్ ప్రస్తుతం బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చారు..దీంతో పాటు తెలంగాణ, బెంగాల్, ఒడిశాల ఇంఛార్జ్గా బాద్యతలు అప్పగించారు..ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ గా తరుణ్ చుగ్ వ్యవహరించారు..1969 సెప్టెంబర్ 20న రాజస్థాన్ లో జన్మించిన సునీల్,, ఏబీవీపీ నాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టారు..ఆటు తరువాత ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా బాధ్యతలు నిర్వహించారు..2010 నుంచి 14 వరకు యూత్ ఎగైన్స్ట్ కరప్షన్ నేషనల్ కన్వీనర్ గా పనిచేశారు..2014లో యూపీ ఎన్నికల కో ఇంఛార్జ్ గా పనిచేసిన సునీల్,,2017లో ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పదోన్నతి పొందరు..2017లో ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీని గెలిపించిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది..అంతే కాకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆలోచనలను ఆచరణంలో పెట్టడడంలో,,సునీల్ చురుగ్గ వ్యవహరిస్తాడని పేరుంది.