AMARAVATHIPOLITICS

అవినీతి విషయంలో ఏపీ మంత్రులు పోటీ పడుతున్నారు-ప్రధాని మోదీ

రాష్ట్రాన్ని జగన్ భ్రష్టుపట్టించారు…

రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు…

అమరావతి: రాష్ట్ర అభివృద్దిని పక్కన పెట్టి,,అవినీతి విషయంలో ఏపీ మంత్రులు పోటీ పడుతున్నారని,,అవినీతి ప్రభుత్వాన్ని  ప్రజలు పెకిలించాలని ప్రధాని మోదీ అన్నారు..ఆదివారం టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ,,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డిపై నిప్పులు చెరిగారు..

ప్రధాని మోదీ:- వైసీపీ ప్రభుత్వ అవినీతి వల్లే ఏపీ అభివృద్ధి చెందలేదని,,గత 5 సంవత్సరాల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కుంటుపడిందని గుర్తు చేశారు..ఆంద్రప్రదేశ్ ప్రజలు ఈ ఎన్నికల్లో రెండు సంకల్పాలు తీసుకోవాలని,, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వాని 3వ సారి ఏర్పాటు చేయడం మొదటి సంకల్పం కాగా రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడడం రెండో సంకల్పం అని అన్నారు..ఆంధ్రలో వైసీపీ, కాంగ్రెస్ ఒక్కటే…రెండూ కుటుంబ పార్టీలే…కాంగ్రెస్, వైసీపీ మధ్య రహస్య స్నేహం ఉంది…వైసీపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్రలు…తమపై ఉన్న వ్యతిరేక ఓటును చీల్చడానికి వైసీపీ,, కాంగ్రెస్ వాడుకుంటోందని ప్రధాని మోదీ ఆరోపించారు…

చంద్రబాబు:-మూడు రాజధానులు అంటూ 3 ముక్కలాటతో అమరావతిని,,రాష్ట్రాన్ని జగన్ భ్రష్టుపట్టించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు..పోలవరాన్ని ఈ ప్రభుత్వం గోదావరిలో కలిపేసిందని,,గంజాయి, అశాంతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు.. జగన్ రక్తదాహానికి చిన్నాన్న చనిపోయాడని ఆరోపించారు..ఇద్దరు చెల్లెళ్లు రోడ్డెక్కి మరీ జగన్‌కు ఓటు వేయొద్దని చెప్తున్నారంటే,,రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు..జగన్ ప్రభుత్వం, పెట్టుబడులను తరిమేసిందని,,ఐదేళ్లలో రోడ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి, అసలు అభివృద్ధే లేదని ఆవేదన వ్యక్తం చేశారు..దేశంలో NDA కూటమికి 400+ సీట్లు వస్తాయని,,రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత మీదేనని ప్రజల్ని కోరారు..

పవన్ కళ్యాణ్:- ప్రజాగళం సభలో ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డిపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు..జగన్ ఒక సారా వ్యాపారి…5 సంవత్సరాల్లో లక్షా 20 వేల కోట్ల వ్యాపారం జరిగితే,, 84 వేల కోట్లు మాత్రమేనని బుకాయించారని,,మిగిలిన సొమ్ము ఎక్కడికి పోయిందంటూ నిలదీశారు… డిజిటల్ భారత్, అని ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే…వైసీపీ మాత్రం ‘క్యాష్’ అంటూ రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని నిప్పులు చెరిగారు. మద్యం, ఇసుకలో కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు..ఈ ప్రభుత్వం వైఎస్ వివేకాను హత్య చేయించిందని పవన్ కళ్యాణ్ ఆరోపణలు గుప్పించారు..చంద్రబాబు నాయుడిని కూడా అనేక ఇబ్బందులు పెట్టిందని,, ఈ ప్రభుత్వం పోవాలని ఆయన పిలుపునిచ్చారు..జగన్ తనని తాను ‘రావణాసురుడు’ అని అనుకుంటున్నాడని,, ఈ ఉద్దేశంతోనే రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారని తూర్పారపట్టారు..అభివృద్ధి లేక రాష్ట్రం అప్పులతో నలిగిపోతోందని,,.జగన్, దాష్టీకాలతో ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు..ఇలాంటి సందర్భంలో ప్రధాని మోదీ రాష్ట్రంకు రావడం ఆనందాన్ని కలిగిందన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *