అమరావతి: కరోనా-19 మందుస్తు హెచ్చరికల్లో బాగంగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. థియేటర్లు, విద్యా సంస్థలు, బార్లు, రెస్టారెంట్లలో మాస్కులు ధరించిన వారికే అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. కొత్త ఏడాది వేడుకల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. జాగ్రత్త ఉండాలని, ఆందోళన అవసరం లేదని ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ తెలిపారు.కొవిడ్ అదుపులోనే ఉందని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. న్యూ ఇయర్ వేడుకలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే నిర్వహించుకోవాలని,,ఆ తర్వాత వేడుకలను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.న్యూఇయర్ వేడుకల సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.