NATIONAL

చైనా చొరబాట్లుకు ప్రధాన కారణం ”హిమాలయన్ గోల్డ్“

అమరావతి: భారత సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ లోకి చీటికి మాటికి చైనా చొరబడేందుకు ఎందుకు ప్రయత్నిస్తొంది ? రాజ్య విస్తారణ కాంక్షనే కారణమా ? కాదు ? ప్రధాన కారణం.. “హిమాలయన్ వయాగ్రాగా” పిలిచే  ‘హిమాలయన్ గోల్డ్’ అని ఇండో పసిఫిక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ (IPCSP) విడుదల చేసిన ఒక నివేదికలో ఆశ్చర్యపరిచే అంశాన్ని ప్రస్తావించారు..పుట్టగొడుగు రకానికి చెందిన కార్డిసెప్స్ ను గొంగళి పురుగు ఫంగస్ లేదా హిమాలయన్ గోల్డ్  అని పిలుస్తారు..దీనికి ప్రపంచ మార్కట్ తో పాటు చైనాలో బంగారం కంటే ఎక్కువ రేటు ఉందని IPCSP నివేదికలో ప్రస్తావించారు..సంస్థ కథనం ప్రకారం….”హిమాలయన్ గోల్డ్“ దాని పేరుకు తగ్గట్టుగానే ఇది భారత్ పరిధిలోని హిమాలయాలలో మాత్రమే లభిస్తుంది..అలాగే చైనా పరిధిలోని నైరుతి ప్రాంతంలో ఉండే క్వింఘాయ్,, టిబెటన్ పీఠభూమిలోని ఎత్తైన ప్రదేశాల్లో కూడా హిమాలయన్ గోల్డ్ దొరుకుతుంది..10 గ్రాముల హిమాలయన్ గోల్డ్ ధర రూ.56వేల దాకా ఉంటుందని అంచనా..అదే మేలు రకం హిమాలయన్ గోల్డ్ కిలో ధర లక్షల్లోనే ఉంటుందని నివేదిక అంచనా వేసింది..ప్రపంచంలోనే అత్యధికంగా హిమాలయన్ గోల్డ్ ను ఉత్పత్తి చేసే,,ఎగుమతి చేసే దేశం చైనాదేశమే..కొన్ని సంవత్సరాల నుంచి చైనాలోని క్వింఘాయ్ ప్రాంతంలో హిమాలయన్ గోల్డ్ సాగు దారుణంగా పడిపోతు వస్తొంది..2011 సంవత్సరంలో చైనా పరిధిలో అత్యధికంగా 1.50 లక్షల కేజీల హిమాలయన్ గోల్డ్ ఉత్పత్తి జరిగింది..2017 వచ్చే సరికి చైనాలో 43,500 కేజీల హిమాలయన్ గోల్డ్ మాత్రమే ఉత్పత్తి జరగగా,, 2018లో ఇది కాస్తా 41,200 కేజీలకు తగ్గింది..దీంతో హిమాలయన్ గోల్డ్ సాగుకు అనువైన భూమిని దక్కించుకునే క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్ పరిధిలోని హిమాలయన్ ప్రాంతాలపై చైనా కన్నేసిందని నివేదికలో పేర్కొంది.ఈక్రమంలోనే ఇటీవల కాలంలో అరుణాచల్ సరిహద్దుల్లో  డ్రాగన్ సైన్యం కవ్వింపు చర్యలు మితిమీరాయని వెల్లడించింది..ఇక్కడ గమనించాల్సి మరో కీలకమైన విషయం,,హిమాలయ ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రధాన ఆదాయం, 80 శాతం హిమాలయన్ గోల్డ్ సేకరణ నుంచే వస్తుంటుంది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *