అమరావతి: పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయుల నియామక కుంభకోణానికి సంబంధించినవిగా భావిస్తున్న దాదాపు రూ.20 కోట్ల నగదును ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు స్వాధీనం చేసుకున్నారు..రాష్ట్ర పరిశ్రమలు,, వాణిజ్యశాఖ మంత్రి పార్థా ఛటర్జీ అనుచరుడు, అర్పితా ముఖర్జీ ఇంట్లో ఈ మొత్తం సోమ్ము దొరికింది..ఈడీ అధికారులు శుక్రవారం మంత్రి పార్థా ఛటర్జీ,, విద్యా మంత్రి ప్రకాశ్ అధికారి,,ఎమ్మెల్యే,,రాష్ట్ర ప్రాథమిక విద్యామండలి మాజీ అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్య,,మరికొంత మంది నాయకుల నివాసాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు..పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద OSDగా పనిచేసిన పి.కె.బందోపాధ్యాయ్, వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఛటర్జీల నివాలపై దాడులు చేశారు..శనివారం ఉదయం కోల్కతాలోని పార్థా చటర్జీ నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు..అలాగే ఆయన అనుచరుడు అర్పితా ముఖర్జీని కూడా అదుపులోకి తీసుకున్నారు..అర్పితా ముఖర్జీ ఇంట్లో దొరికిన రూ.20 కోట్లు ఉపాధ్యాయుల నియామక కుంభకోణానికి సంబంధించినవేనని భావిస్తున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో పేర్కొంది..నగదుతో పాటు 20కి పైగా సెల్‌ఫోన్లను అర్పితా ముఖర్జీ నివాసం నుంచి జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు..నేరాన్ని ధృవీకరించే డాక్యుమెంట్లు,, పాటు సూట్ కేసు కంపెనీల వివరాలు,,విదేశీ కరెన్సీ,,బంగారం,, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు,నాయకులు వద్ద వద్ద లభించాయని ఈ.ఢీ వెల్లడించింది.. పార్థా ఛటర్జీ విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి..