AMARAVATHICRIME

నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన అబ్దుల్ సలీంను అరెస్ట్ చేసిన NIA

అమరావతి: బెంగళూరు పేలుళ్ల ఘటనతో ఆప్రమత్తమైన NIA కడప జిల్లాలో టెర్రరిస్టు లింకులపై ఆరా తీస్తూండగా ఓ నిషేధిత సంస్థలో పనిచేస్తున్న కీలక వ్యక్తిని సమాచారం రావడంతో అతనిని NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు.. వివరాల్లోకి వెళ్లితే………. కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం పరిధిలోని చెర్లోపల్లె వద్ద ఓ మసీదులో తలదాచుకున్న సలీం అనే నిషేధిత సంస్థ PFI ఏజెంట్‌ను NIA అధికారులు అరెస్ట్ చేశారు..నిషేధిత సంస్ద పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన అబ్దుల్ సలీం ఉత్తర తెలంగాణ PFI సెక్రటరీగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.. అబ్దుల్ సలీం స్వస్థలం జగిత్యాలగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు..25 రోజుల క్రిందట మైదుకూరుకు వచ్చిన సలీం తనకు జీతం ఏమీ వద్దని మసీదులో సేవ చేసుకుంటూ ఉంటానని వారిని నమ్మించాడు..అతను ఎవరికి అనుమానం రాకుండా ఆన్ లైన్ ఫోన్లు మాట్లాడుతుండటంతో NIAకు సమాచారం అందింది..దీంతో అధికారులు రంగంలోకి దిగి  అబ్దుల్ సలీంను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు..సలీంపై రెండులక్షల రూపాయల రివార్డ్ ప్రకటించి ఉందని అధికారులు తెలిపారు.. 2022 జులైలో నిజామాబాద్ పోలీసుస్టేషన్ లో అబ్దుల్ సలీమ్ తో సహా 11 మంది నిందితులపై కేసు నమోదైంది..సలీం అప్పటి నుంచి ఇతను పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *