AMARAVATHI

ఎవరి కళ్ళలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి, పవిత్ర యజ్ఞోపవీతాన్ని తెంచారు-పవన్ కళ్యాణ్

అమరావతి: పంచారామాల్లో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సోమేశ్వరస్వామి క్షేత్రంలో అర్చకుడి పండ్రింగి.నాదేంద్ర పవన్ పై వైసీపీ నేత దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.. బుధవారం అయన మాట్లాడుతూ ఎవరి కళ్ళలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి యజ్ఞోపవీతాన్ని తెంచారని ప్రశ్నించారు.. సోమేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకుడిపై వైసీపీ నాయకుడు దాడికి తెగబడి యజ్ఞోపవీతాన్ని తుంచేయడం పాలక వర్గం అహంభావానికి, దాష్టీకానికి ప్రతీక అని మండిపడ్డారు..ఆలయ బోర్డు ఛైర్మన్ భర్త యుగంధర్ చేసిన దాడిని సనాతన ధర్మంపై దాడిగా భావించి ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.. వేదాలు చదివి భగవంతుని సేవలో ఉండే అర్చకులపై దాడి చేయడం,,వారిని భయపెట్టడం రాక్షసత్వమే అని మండిపడ్డారు.. ప్రశాంతంగా పవిత్రంగా ఉండాల్సిన ఆలయ ప్రాంగాణాల్లో అహంకారం,, అధికార దర్పం చూపడం క్షమార్హం కాదన్నారు..అన్నవరంలో పురోహితులను వేలం వేయాలని ప్రభుత్వం ఒక అర్థం లేని నిర్ణయం తీసుకున్నదని,, జనసేన తీవ్రంగా వ్యతిరేకించేసరికి వెనక్కి తగ్గారని జనసేనాని వెల్లడించారు..

వైసీపీ నేతల ఆరాచకలకు కొనసాగింపుగా ప్రస్తుతం పంచారామ క్షేత్రంలో అర్చకుడిపై దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వైసీపీ ప్రభుత్వం హిందూ ఆలయాలు,, ఆస్తులపై పూర్తి ఆధిపత్యాన్ని చలాయించే క్రమంలోనే ఇలాంటి చర్యలకు ఒడిగడుతోందని ఆరోపించారు..జరిగిన సంఘటన స్థానిక వైసీపీ నాయకుడు చేసిన దాడిగా భావించలేమన్నారు..” యథా నాయకుడు-తథా అనుచరుడు” అన్న చందనా వైసీపీ నాయకులు తయారయ్యారని విమర్శించారు.. ఎవరి కళ్ళలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి, పవిత్ర యజ్ఞోపవీతాన్ని తెంచేశారో ఆ పరమేశ్వరుడికే తెలియాలన్నారు..ఈశ్వరుని సన్నిధిలో దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..ఈ ఘటనతో పాటు రాష్ట్రంలో హిందూ ఆలయాల నిర్వహణలో ప్రభుత్వ వైఖరి,,ఆలయాలపై దాడుల గురించి కేంద్రానికి నివేదిక అందిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *