AMARAVATHIDEVOTIONAL

శబరిమలకు రైల్వే ట్రాక్ వేసే విషయంలో రెండు ప్రత్యామ్నాయ మార్గాలు-అశ్విని వైష్ణవ్

అమరావతి: కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌ల రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి స‌హ‌కారం అంద‌డంలేద‌ని, అయితే శ‌బ‌రిమ‌ల‌కు రైల్వే ట్రాక్ వేసే విష‌యంలో రెండు ప్ర‌త్యామ్నాయ మార్గాల గురించి ఆలోచిస్తున్నామ‌ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ వెల్ల‌డించారు..బుధవారం శ‌బ‌రిమ‌ల రైల్వే ప్రాజెక్టుకు చెందిన కొన్ని అంశాల‌ను లోక్‌స‌భ‌లో ప్రశ్నోత్తర సమయంలో కేంద్ర మంత్రి సమాధానం ప్రస్తావిస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్టు గురించి స్ట‌డీ చేస్తున్నా ఎటువంటి ప్ర‌గ‌తి సాధించ‌లేక‌పోయామ‌న్నారు.. శ‌బ‌రిమ‌ల ఆల‌యానికి వెళ్లే భ‌క్తుల కోసం ఈ రైలు మార్గాన్ని వేయాల‌ని చాన్నాళ్లుగా డిమాండ్ ఉందన్నారు.. భూసేక‌ర‌ణ‌, నిధుల కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం స‌హ‌య నిరాకరణ చేస్తొందని మంత్రి తెలిపారు.. శ‌బ‌రిమ‌ల వ‌ర‌కు రెండు మార్గాల గురించి స్ట‌డీ చేస్తున్నామ‌ని,, ఒక మార్గంలో పంబ వ‌ద్ద‌కు వెళ్లే రూటు గురించి ఆలోచిస్తున్నామ‌న్నారు..అలాగే మ‌రో మార్గంలో ఆల‌యానికి 25 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు రైలు వెళ్లే మార్గాన్ని స్ట‌డీ చేస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.. రెండు మార్గాల గురించి సంపూర్ణంగా అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వైష్ణ‌వ్ చెప్పారు..చెంగ‌న్నూరు నుంచి పంబ వ‌ర‌కు కొత్త రైల్వే రూటును వేసేందుకు ప్లాన్ చేశామని,,దీనికి సంబంధించిన డీపీఆర్ సిద్ధం అవుతోంద‌న్నారు.. అయితే ఏ మార్గాన్ని ఎంచుకోవాల‌న్న అంశాన్ని ఖరారు చేసిన త‌ర్వాత శ‌బ‌రి రైల్వే ప్రాజెక్టు ప‌నులు ప్రారంభం అవుతాయ‌ని మంత్రి స్పష్టం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *