AMARAVATHIDISTRICTS

వైద్యుల నివేదికను కోర్టు దృష్టికి తీసుకువెళతాం-DIG రవికిరణ్

చంద్రబాబుకు తీవ్ర ఆరోగ్య సమస్యలు..
అమరావతి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై జైళ్లశాఖ కోస్టల్ ఏరియా DIG రవికిరణ్, SP జగదీష్, డాక్టర్ల టీమ్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు..ఈ సందర్బలో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వాస్పత్రి వైద్యులు నివేదిక వెల్లడించారు..చంద్రబాబుకు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు మెడికల్ రిపోర్ట్ లో వైద్యులు తెలిపారు.. చంద్రబాబు చేతులు, మొహంతో పాటు ఇతర శరీర భాగాల్లో దద్దుర్లు, స్కిన్ అలెర్జీ ఉన్నట్లు నిర్ధారించారు.. తీవ్రమైన ఎండల కారణంగా చంద్రబాబు కొద్దిరోజులుగా డిహైడ్రేషన్ తో ఇబ్బంది పడుతున్నారని,,డిహైడ్రేషన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాటు చేయాలని వైద్యులు నివేదికలో స్పష్టంగా తెలిపారు..
DIG మాట్లాడుతూ వైద్యులు ఇచ్చిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని, చల్లని వాతావరణం ఏర్పాటు చేసే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని పేర్కొన్నారు..చంద్రబాబు వ్యక్తిగత వైద్యుల పర్యవేక్షణలోనే వైద్యం అందించాలని చంద్రబాబు కోరారని చెప్పారు..వైద్యుల నివేదికను కోర్టు దృష్టికి తీసుకువెళతాం..చంద్రబాబుకు 24 గంటలు వైద్యం అందిస్తాం.. చంద్రబాబు వ్యక్తిగత వైద్యులతో డాక్టర్ల బృందం మాట్లాడారు.. ఆయన వ్యక్తిగత వైద్యులు సూచిస్తే అవసరమైన వైద్య పరీక్షలు చేస్తాం.. జైలుకు వచ్చినప్పుడు వాతావరణం మారుతుంది..ఇంటి వద్ద వాతావరణానికి భిన్నంగా ఉంటుందని DIG రవికిరణ్ తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *