AMARAVATHI

ఏ.పి స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు ఎప్పుడైనా అరెస్ట్-సజ్జల

అమరావతి: ఏ.పి స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల.రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు కొట్టివేసింది..బుధవారం ఈ సందర్బంలో అయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పార్టీలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష చెయావచ్చా? లేదా? అన్నది ఎప్పుడూ చర్చనీయాంశమే అన్నారు..గత ప్రభుత్వంలో స్వార్థపూరితంగా జరిగిన కొన్ని నిర్ణయాల వల్ల ప్రజలకి నష్టం కలిగించినప్పుడు కచ్చితంగా సమీక్ష జరగాల్సిందే అన్నారు..మా ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసి అసెంబ్లీలో చర్చించిన తర్వాతే సిట్ ఏర్పాటు జరిగిందని సజ్జల గుర్తు చేశారు..ఈ నిర్ణయం మేము కక్షపూరితంగా తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు..సిట్ ఏర్పాటును హైకోర్టులో ఛాలెంజ్ చెయ్యడంలోనే టీడీపీ నేతల భయం కనిపిస్తుందన్నారు..సిట్ వెయ్యగానే ఎందుకంత భయపడి కోర్టులకు వెళ్లి సాంకేతిక కారణాలు చూపి స్టే తెచ్చుకున్నారు ? అంటూ టీడీపీ నేతలను నిలదీశారు..

రాజధాని కుంభకోణం:- రియల్ ఎస్టేట్ స్కాంకు రాజధాని అమరావతి పేరు పెట్టారని,,దినిని అడ్డం పెట్టుకుని దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్ కు పాల్పపడ్డారు…అమరావతిలో ఎక్కడ చూసిన అవినీతే…రాజధాని పెట్టేందుకు అవకాశం లేని చోట రాజధాని పెట్టారు…

చంద్రబాబు ఎప్పుడైనా అరెస్ట్:- స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది…అరెస్ట్ చేస్తే వేధింపులు అంటారు… చెయ్యకపోతే ధైర్యం లేదు అంటున్నారు…ఏం పీకారు అంటున్నారు… వీళ్లకు ఏమైన రెండు నాల్కలు వున్నాయా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు..కేసుల విచారణ జరుగుతోంది… కచ్చితంగా అరెస్టులు జరుగుతాయి..చంద్రబాబు అవినీతిపై గట్టి ఆధారాలు ఉన్నాయి…తప్పు చేశారు కనుక తండ్రీకొడుకుల్లో భయం ఉంది…పైకేమో భీరాలు పలుకుతున్నారంటూ ఎద్దేవ చేశారు..

సిట్‌పై స్టే ఎత్తివేత:- టీడీపీ ప్రభుత్వ విధాన నిర్ణయాలపై దర్యాప్తు కోసమని ఏపీ ప్రభుత్వం Special Investigation Team (SIT) ‘సిట్’ ఏర్పాటు చేసింది… సిట్‌ ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇచ్చింది…హైకోర్టు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది…దీనిపై విచారించిన సుప్రీంకోర్టు…సిట్ పై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టేసింది…ఈ కేసును మరోసారి మెరిట్ ప్రాతిపదికన విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సూచించింది..

విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసమేనా? అని ప్రశ్నించింది.. హైకోర్టు ముందుగా ఈ విషయంలో జోక్యం చేసుకుందని, అందుకే మధ్యంతర ఉత్తర్వులను తోసిపుచ్చుతున్నామని వెల్లడించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *