DISTRICTSSPORTS

జిల్లా స్థాయి చెస్ క్రీడా పోటీల విజేతలు

నెల్లూరు: మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్,స్పోర్ట్స్,భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలి సారిగా ఫిడే ఇండియా ద్వారా జూలై 28వ తేది నుంచి 10 ఆగష్టు వరకు చెన్నై నగరంలో నిర్వహించే 44వ చెస్ ఓలంపియాడ్ టోర్నమెంట్ సందర్బంగా ఈ నెల 23వ తేది నుంచి తిరుపతిలో జరగబోవు ఒలింపియాడ్ టార్చ్ ర్యాలిలో పాల్గొనబోవు నెల్లూరు జిల్లా క్రీడాకారులను ఎంపిక చేసేందుకు గురువారం స్థానిక ఏ.సి స్టేడియంలో జిల్లా స్థాయి చెస్ క్రీడా పోటీనుల సి.ఇ.ఓ పుల్లయ్య,చీఫ్ కోచ్ యతిరాజ్ లు ప్రారంభించారు..జిల్లా స్థాయి పోటీలకు జిల్లా నలుమూల నుంచి 23 మంది బాలురు,,11 మంది బాలికలు పాల్గొన్నారు.. అనంతరం పోటీల్లో మొదటి,ద్వితీయ,తృతీయ స్థానంలో గెలుపొందిన వారికి నెహ్రుయువకేంద్రం జిల్లా యూత్ ఆధికారి మహేంద్రరెడ్డి బాహుమతులు అందచేశారు.ఈకార్యక్రమంలో ఆంధ్రచెస్ అసోసియేషన్ ప్రతినిధి మస్తాన్ బాబు,తదితరులు పాల్గొన్నారు..జిల్లా స్థాయి చెస్  పోటీల్లో మొదటి 3 స్థానాల్లో గెలుపొందిన క్రీడాకారులకు (బాల,బాలికు) ఈ నెల 23వ తేదిన తిరుపతిలో జరగబోవు ఒలింపియాడ్ టార్చ్ ర్యాలిలో పాల్గొని,చెస్ గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబు తో ఆడేందుకు అవకాశం కల్పించబడుతుంది..

విజేతలు:-బాలురు—మొదటి స్థానం-సి.హెచ్.ద్వారకానాధ్,,ద్వితీయ స్థానం-ఎం.గురునాథం,,తృతీయ స్థానం-ఎస్.కె.సమద్ లు,,,,,,బాలికలు–మొదటి స్థానం-వి.ప్రద్యుమ్నలక్ష్మి,,ద్వితీయ స్థానం-బి.కీర్తన,,తృతీయ స్థానం-ఎస్.జాహ్నవిలుగా నిలిచారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *