AMARAVATHINATIONAL

సినిమా సెన్సార్ సర్ఠిఫికేట్ జారీలో కొత్త నిబంధనలు-అనురాగ్ ఠాకూర్

అమరావతి: సినిమాటోగ్రఫీ చట్టంలో కొన్ని కొత్త సవరణలు చేర్చుతూ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023 ప్రవేశపెట్టారు..సినిమాటోగ్రఫీ 1952 బిల్ కు కొన్ని సవరణలు చేస్తూ లోక్ సభలో బిల్ ప్రవేశపెట్టగా అక్కడ పాస్ అయింది..అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఈ బిల్ ని రాజ్యసభ కూడా పాస్ చేసింది..ఈ బిల్ లో ముఖ్యంగా పైరసీ, సెన్సార్ అంశాలతో పాటు సర్టిఫికేట్ లపై నిర్ణయాలు చేర్చారు..సవరించిన సినిమాటోగ్రఫీ బిల్ ప్రకారం ఇకపై సినిమాని పైరసీ చేసినా, సినిమాని థియేటర్స్ లో రికార్డ్ చేసినా మూడేళ్ళ జైలు శిక్షతో పాటు, ఆ సినిమా ప్రొడక్షన్ ఖర్చులో 5 శాతం జరిమానా విధిస్తారు..ఇప్పటివరకు సెన్సార్ బోర్డు సినిమాలకు నాలుగు రకాల సెన్సార్ సర్టిఫికెట్స్ జారీ చేస్తున్నారు..సవరించిన బిల్లులో వీటికి మరో మూడింటిని పెంచారు.. క్లీన్ U,,U/A,,A,, S సర్టిఫికెట్స్ ప్రస్తుతం ఇస్తున్నారు.. తాజాగా U/A లోనే మరో మూడు సర్టిఫికెట్లు తీసుకొచ్చారు..UA 7+,, UA 13+,,UA 16+ సర్టిఫికెట్స్ ఇవ్వనున్నారు..ఇవి పై ఏజ్ గ్రూప్ లో ఉన్నవాళ్లు పేరెంట్స్ పర్యవేక్షణలో మాత్రమే చూడాలి.. సినిమాలో వైలెన్స్,, సెక్సువల్ కంటెంట్ ఆధారంగా ఈ సర్టిఫికెట్స్ ని జారీ చేయనున్నారు..అలాగే సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే Central Board of Film Certification (CBFC) కి పూర్తి అధికారాలు కల్పించి,, సినిమాకు తగ్గట్టు సినిమా ప్రసార మాధ్యమాన్ని తగ్గట్టు సర్టిఫికెట్ ఇచ్చేలా ఒక అటానమస్ సంస్థలా విధులు నిర్వహించేలా మార్పులు చేశారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *