AMARAVATHI

జై జవాన్ జై కిసాన్ దేశ ప్రజల్లో స్ఫూర్తి రగిలించిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 119వ జయంతి

అమరావతి: జై జవాన్ జై కిసాన్ అంటూ దేశ ప్రజల్లో స్ఫూర్తి రగిలించిన, భారత మాజీ ప్రధాని, భారతరత్న..లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నేడు..అక్టోబర్ 2వ తేది 1904వ సంవత్సరంలో మొగల్‌సరాయ్‌లో శారద ప్రసాద్ శ్రీవాస్తవ,, రామదులారిదేవి దంపతులకు జన్మించారు..ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఇంటర్ కాలేజ్,,హరీష్ చంద్ర హైస్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు.. స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ,  అనిబెసెంట్ గురించి చదవడం ద్వారా శాస్త్రి ఆలోచనలు ప్రభావితమయ్యాయి. గాంధీ ప్రసంగాలతో ప్రభావితమైన శాస్త్రి 1920 లలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చేరాడు.. సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేశారు.. 1947లో స్వాతంత్ర్యం తరువాత, లాల్ బహదూర్ శాస్త్రి భారత ప్రభుత్వంలో ప్రధాన మంత్రి నెహ్రూ మంత్రివర్గ బాధ్యతలు తీసుకున్నారు.. మొదట  రైల్వే మంత్రిగా (1951-56), ఆటు తరువాత హోం మంత్రితో సహా అనేక ఇతర బాధ్యతలను నిర్వర్తించారు.. ప్రధానమంత్రిగా బాద్యతలు చేపట్టిన తరువాత దేశ హితం కోసం పలు సంస్కరణలు చేపట్టారు.. భారతదేశ ఆహారోత్పత్తిని పెంచాల్సిన అవసరాన్ని గుర్తించి శాస్త్రి 1965లో భారతదేశంలో హరిత విప్లవాన్ని ఎంతగానో ప్రోత్సహించారు..ఇది ఆహార ధాన్యాల ఉత్పత్తి, ముఖ్యంగా పంజాబ్,  హర్యానా,,  ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పెరుగుదలకు దారితీసింది.. శాస్ర్రి  రెండవ భారతదేశం-పాకిస్తాన్ యుద్ధంలో దేశానికి నాయకత్వం వహించాడు ..అ సమయంలో ” జై జవాన్, జై కిసాన్” (“సైనికునికి నమస్కారం; రైతుకు నమస్కారం”) అనే నినాదంలో యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యం పొందింది.. యుద్ధం అధికారికంగా 10 జనవరి 1966న తాష్కెంట్ ప్రకటనతో ముగిసింది..కొన్ని కుట్రల కారణంగా?  మరుసటి రోజు శాస్త్రి రష్యాలో మరణించాడు?..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *