AMARAVATHINATIONAL

చట్టసభల్లో “మహిళా రిజర్వేషన్ బిల్లుకు” రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమోదం

అమరావతి: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో లోకసభ,,రాజ్యసభల్లోనూ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక ‘మహిళా రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదించారు..దీంతో ఈ బిల్లు చట్టరూపం సంతరించుకుంది…చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన నారీ శక్తి వందన్ అధినియమ్ బిల్లును పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్ 19న లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు..చర్చ అనంతరం లోక్ సభ ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. సెప్టెంబర్ 21న రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టగా పెద్దలసభ సైతం బిల్లుకు ఆమోద తెలిపింది..ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో మహిళల మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది..చట్టం తక్షణం అమల్లోకి వచ్చే అవకాశాలు ప్రస్తుతం లేనట్లే.. జనగణన, డీలిమిటెషన్ తరువాత చట్టాన్ని అమల్లోకి తెస్తామని బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ లోక్ సభకు తెలిపారు.. 2024 ఎన్నికలు పూర్తికాగానే జనగణన ప్రారంభిస్తామని హోం మంత్రి అమిత్ షా తెలిపారు.. ప్రస్తుత డీలిమిటేషన్ ప్రక్రియ 2026 వరకూ అమల్లో ఉండనుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *