AMARAVATHINATIONAL

NIA డైరెక్టర్​ జనరల్​గా సందానంద్​ వసంత్ దాతె-ముంబయి 26/11 హీరో

అమరావతి: దేశంలో ఉగ్రవాదుల నుంచి ముప్పు పెరుగుతున్ననేపధ్యంలో,,ఉగ్రవాదులను ఎక్కడిక్కడ అరెస్టులు చేసి కటకటాల వెనక్కు నెట్టడంలో చురుగ్గ వ్యవహారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు కొత్త సారథిగా సదానంద్ వసంత్ దాతె నియమితులైయ్యారు..ఇప్పటి వరకు మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం(ATF)కు చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సదానంద్ వసంత్ దాతెను NIA డైరెక్టర్​ జనరల్​గా నియమిస్తూ గురువారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది..ప్రస్తుతం NIA డైరెక్టర్​ జనరల్​గా ఉన్న దినకర్ గుప్తా మార్చి 31వ తేదిన పదవీ విరమణ చేయనున్నారు..ఆయన స్థానంలో నియమితులైన వసంత్​ దాతె 2026 డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో కొనసాగునున్నారు..

1990 బ్యాచ్​ ఉత్తర్​ప్రదేశ్​ IPS​ క్యాడర్​కు చెందిన వసంత్ దాతె, ముంబయి 26/11 ఉగ్రదాడి ప్రధాన నిందితులు అజ్మల్‌ కసబ్‌, అబు ఇస్మాయిల్‌లను బందించడంలో కీలకంగా వ్యవహరించారు..ఉగ్రదాడుల సయమంలో ఆయన ముంబయి అదనపు పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్నారు..ఛత్రపతి శివాజీ టెర్మినల్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారనే సమాచారంతో అక్కడికి చేరుకొని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సాహసోపేతంగా పోరాడారు.. ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్‌ ధాటికి కాళ్లూచేతులకు తీవ్రగాయాలై,,రక్తం కోల్పోయి తాను స్పృహతప్పి పడిపోయేంతవరకు దాదాపు గంటసేపు ఆయన వీరిద్దరినీ అక్కడి నుంచి కదలనీయ్యాలేదు..అదే సమయంలో ఉగ్రవాదులు పౌరులపై కాల్పులు జరిపేపేందుకు అవకాశం లేకుండా చేయడంతో,, ఎంతోమంది పౌరుల ప్రాణాల్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరించారు.. ఆనాటి సాహసోపేత చర్యకు గానూ రాష్ట్రపతి నుంచి పోలీసు పతకాన్ని  వసంత్ దాతె అందుకున్నారు..ఉగ్రదాడుల కేసుల దర్యాప్తుల్లో నిపుణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.. వసంత్‌ దాతెకు అధునాతన ఆయుధాలను అలవోకగా ఉపయోగించే సామర్థ్యం ఉంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *