AMARAVATHINATIONAL

ఇక ముందు రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి-సుప్రీంకోర్టు

తొలగిపోనున్న ఆనర్హత..
అమరావతి: సుప్రీంకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పడిన రెండేళ్ల శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది..సార్వత్రిక ఎన్నికల సందర్బంలో కర్ణాటకలో ప్రచారం నిర్వహిస్తూ మోదీ ఇంటి పేరు’ ను కించపరిచారని 2019లో రాహుల్ గాంధీపై కేసు నమోదైంది..ఈ కేసులో సూరత్ ట్రయల్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది.. రాహుల్ కు పడిన రెండేళ్ల శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ,,మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసు విచారణ చేపట్టింది.. రాహుల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ,,పరువు నష్టం దావా వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అసలు ఇంటిపేరు మోదీ కాదని ఆయన ఆ ఇంటిపేరును తర్వాత పెట్టుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు..ఎన్నికల్లో పోటీ చేసేందుకు, పార్లమెంట్ కు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ నిర్దోషిగా విడుదలయ్యేందుకు ఇదే చివరి అవకాశమని కోర్టుకు విజ్ఞప్తి చేశారు..పూర్తి వాదనలు విన్నతరువాత సుప్రీంకోర్టు ధర్మాసనం రాహుల్ గాంధీకి సూరత్ ట్రయల్ కోర్టు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించింది..ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..ఇక ముందు రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని హెచ్చరించింది..సుప్రీంకోర్టు స్టేతో రాహుల్ గాంధీ పై అనర్హత వేటు తొలగిపోనుంది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *