NATIONAL

భారతదేశం బలమైన శక్తిగా ఎదుగుతుండడం సహించలేకున్నారు-స్మృతి ఇరానీ

ఇన్వెస్టర్(ముసుగులో) జార్జి సోరోస్..

అమరావతి: కొన్ని విదేశీ మతత్వశక్తులు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని లక్ష్యంగా చేసుకుని,,వివిధ మార్గల్లో కుట్రలు పన్నుతుంటాయని,,అదానీ-హిడెన్ బర్గ్ అంశంపై అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్(ముసుగులో) జార్జి సోరోస్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీపై వ్యాఖ్యలు చేశారు..ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం బలమైన శక్తిగా ఎదుగుతుండడం సహించలేని,,చాలా శక్తలు (అందులో జార్జి సోరోస్),,దేశాని బలహీన పరచేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు..శుక్రవారం మీడియా సమావేశంలో మంత్రి ఇరానీ మాట్లాడుతూ, జార్జి సోరోస్ తన వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వాన్ని ప్రభావితం చేయాలనుకోవడం ఆయన ప్రకటనలో స్పష్టంగా గోచరిస్తోందన్నారు..అమెరికా,ఐరోపా దేశాల ఒత్తిడికి తలొగ్గకుండా,,భారతదేశ ప్రయోజనలే ముఖ్యంగా పని చేస్తున్న ప్రధాని మోదీని,,టార్గెట్‌గా చేసుకునేందుకే జార్జి సోరోస్ బిలియన్ డాలర్ల ఫండింగ్ ప్రకటించినట్టు మంత్రి విమర్శించారు..

భారతదేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ప్రభుత్వాన్నిఎన్నుకుంటాయని మంత్రి స్మృతి అన్నారు..భారతదేశ ప్రజాస్వామ్యం ఎప్పటికీ చెక్కుచెదరదని,,మన ప్రజాస్వామ్యాన్నిబలహీనపరచేందుకు ఎవరెన్ని దుష్ట పన్నాగాలు పన్నినా ప్రధాని మోదీ నాయకత్వంలో బలంగా ఎదుర్కుంటామని అన్నారు.. జార్జి సోరోస్ తన శక్తియుక్తులను ఇండియాకు కాకుండా తన(అమెరికా) దేశానికి లబ్ధి పొందేందుకు ఉపయోగిస్తుంటారని,, అదానీ గ్రూప్ అంశంపై ఆయన ఆలోచనా ప్రక్రియ, ప్రకటనలను భారతీయులంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు..”ప్రపంచంలోనే ఐదవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడంపై ప్రధాని మోదీని అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులతో పాటు, ఇంగ్లాడ్ ప్రధాని బహిరంగంగా ప్రశంసించారు..ఇలాంటి సమయంలో ఒక సామ్రాజ్యవాద పెట్టుబడిదారు వ్యాఖ్యలు వెలుగుచూశాయి” అని స్మృతి ఇరానీ వెల్లడించారు..జార్జి సోరోస్ ఎవరికి నిధులు ఇస్తున్నారనే విషయం మీడియా వ్యక్తులందరికీ బాగా తెలుసునని,, ఆయన మోదీని లక్ష్యంగా చేసుకున్నారని, భవిష్యత్తులో కూడా ఆయన టార్గెట్ అదే విధంగా ఉండబోతోందని చెప్పారు..

ఇన్వెస్టర్(ముసుగులో):– గౌతమ్ అదానీ వ్యాపారాలో తలెత్తిన గందరగోళంతో స్టాక్ మార్కెట్ కుదేలయిందని, పెట్టుబడి అవకాశాలకు తలుపులు బార్లా తెరిచిన ఇండియాపై విశ్వాసానికి ఇది కుదుపులాంటిందని జార్జి సోరోస్ అన్నారు.. ఇంకా కొన్ని సంస్థాగత సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఉందని,,ఇండియాలో పెట్టుబడిదారుల విశ్వాసానికి విఘాతం కలిగించే విధంగా అదానీపై ఇటీవల హిండెన్ బర్గ్ వ్యాఖ్యలు చేసిన క్రమంలో జార్జి సోరోస్ తాజా వ్యాఖ్యలు చేశారు..అదానీ వ్యవహారంపై మోదీ మౌనంగా ఉండటాన్ని కూడా జార్జి సోరోస్ ప్రశ్నించారు.. విదేశీ పెట్టుబదిదారుల ప్రశ్నలకు, పార్లమెంటులోనూ ఆయన (ప్రధాని మోదీ) సమాధానం ఇవ్వాలని అన్నారు..

ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్:- ప్రపంచ బిలియనీర్ సోరోస్ ఆస్తి విలువ 8.5 బిలియన్ డాలర్లు..ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ వ్యవస్థాపకుడు..ప్రజాస్వామ్యం, జవాబుదారీతనం, వాక్ స్వేచ్ఛను ప్రమోట్ చేసే సంస్థలు, వ్యక్తులకు నిధులు ఇస్తు,,స్వచ్చంద సంస్థ ముసుగులో,,కొంత మంది జర్నలిస్టులను అడ్డం పెట్టుకుని,,ప్రభుత్వలపై బురద చల్లిస్తుంటాడు అనే ఆరోపణలు వున్నాయి..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *