AMARAVATHIHYDERABADSPORTS

మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పై పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు

హైదరాబాద్: మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది..ఉప్పల్ స్టేడియంలో వివిధ సామాగ్రి కొనుగోళ్లలోకోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని ఆరోపిస్తూ HCA CEO సునీల్ చేసిన ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు..2019-22 మధ్య HCA అధ్యక్షుడిగా అజర్ ఉన్న సమయంలో అక్రమాలను జరిగినట్లు ప్రత్యేక విచారణ కమిటీ నిర్ధారించింది… ఇందులో అగ్నిమాపక పరికరాలు, క్రికెట్ బంతులు, బకెట్ కుర్చీలు, జిమ్ సామాగ్రితో సహా అనేక పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయని CEO ఫిర్యాదులో పేర్కొన్నారు..అజారుద్దీన్ పై IPC 406,409, 420, 465, 467, 471, 120(b) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *