AMARAVATHINATIONAL

మార్చి 9వ తేదీ తరువాత సార్వత్రిక ఎన్నికలకు మూహుర్తం ?

అమరావతి: 2024 లోక్‌సభ ఎన్నికలకు మూహుర్తం సమీపిస్తూన్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ( E.C.I) ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం..మార్చి 9వ తేదీ తరువాత 18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్డ్ ను E.C ప్రకటించే అవకాశం ఉంది..పార్లమెంట్‌ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్,,ఒడిశా,, అరుణాచల్ ప్రదేశ్,, సిక్కిం అసెంబ్లీలకు ఈ సంవత్సరం మేలోగా ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది.. ఇందులో బాగంగానే E.C బృందం గత కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి, రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించారు.. ఈ ఎన్నకలతో పాటు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించాలని ఈసీ భావిస్తోందా? ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో మార్చి 8, 9 తేదీల్లో E.C అధికారులు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.. ఎన్నికల సంసిద్ధతను పరిశీలించేందుకు మార్చి 12,13 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నట్లు సమాచారం.. లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశాలపై ఒక అంచనాకు రానున్నట్లు తెలుస్తోంది.. గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ ప్రకటించారు.. ఏప్రిల్‌ 11 నుంచి మే 19వ తేదీ వరకూ 7 దశల్లో పోలింగ్‌ జరిగింది.. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *