AMARAVATHINATIONAL

జమ్ముకశ్మీర్‌ యువత ఆకాంక్షలను తమ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుంది-ప్రధాని మోదీ

32,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు..

అమరావతి: జమ్ముకశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370 అభివృద్దికి అడ్డు గొడగా ఉందని,,అందుకే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంతో నేడు జమ్ముకశ్మీర్‌ వేగంగా అభివృద్ది చెందుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాలుగు సంవత్సరాల తరువాత మంగళవారం జమ్ముకశ్మీర్‌లో పర్యటించారు..ఈ సందర్భంలో ప్రధాని మోదీ రూ.32 వేల కోట్ల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించారు..ప్రధాని మాట్లాడుతూ 2014తో పోలిస్తే కశ్మీర్‌ అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందన్నారు..జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక అయిన దాదాపు 1,500 మందికి ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందజేయడంతో పాటు వారందరినీ అభినందించారు.. జమ్ముకశ్మీర్‌ యువత ఆకాంక్షలను తమ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని హమీ ఇచ్చారు..జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని,,అవినీతిని, వారసత్వ రాజకీయాలను జమ్ముకశ్మీర్‌ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు..విద్యా , వైద్య రంగాల్లో జమ్ముకశ్మీర్‌కు కేంద్రం పెద్ద పీట వేస్తునట్టు తెలిపారు..జమ్మూ కాశ్మీర్‌లో సామాజిక న్యాయం కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు..గుజ్జర్లు, పహారీలు, ఎస్టీలు, ఎస్సీలు, కాశ్మీరీ పండిట్లు, పశ్చిమ పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులు రాష్ట్రంలో తమ హక్కులను పొందారని గుర్తు చేశారు.

32,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు:- జమ్మూ కాశ్మీర్‌లో రూ. 32,000 కోట్ల విలువైన విద్య, రైల్వే, విమానయానం, రోడ్డు రంగాలకు సంబంధించిన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు..ఈ ప్రాజెక్టులలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIMలు), సెంట్రల్ యూనివర్శిటీలు ఉన్నాయి.. రైల్వే ప్రాజెక్టులలో బనిహాల్-ఖరీ-సంబర్-సంగల్దాన్ (48 కి.మీ) మధ్య రైల్వే లైన్,, కొత్తగా విద్యుద్దీకరించిన బారాముల్లా-శ్రీనగర్-బనిహాల్-సంగల్దన్ సెక్షన్ (185.66 కి.మీ) ప్రారంభించారు..లోయలో తొలి ఎలక్ట్రిక్ రైలును,, సంగల్దాన్,, బారాముల్లా స్టేషన్ల మధ్య రైలు సర్వీసును ఆయన పచ్చాజెండా ఊపి ప్రారంభించారు..‘వికసిత్ భారత్, వికసిత్ జమ్మూ’ కార్యక్రమంలో భాగంగా వివిధ పథకాల లబ్ధిదారులతో ప్రధాని మోదీ సంభాషించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *