వైభవంగా అర్జున తపస్సు-భక్తజనసంద్రమైన ధర్మరాజస్వామి ఆలయం

శ్రీకాళహస్తీ: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్ధానంకు అనుబంధమైన ద్రౌపదీ సమేత ధర్మరాజుస్వామి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం అర్జున తపస్సు వైభవంగా జరిగింది..అర్జునుడు ఘోర తపస్సు చేసి, శివునితో యుద్ద చేస్తాడు,అనంతరం తప్పు తెలుసుకుని,ముక్కంటి నుంచి పాశుపతాస్ర్తాన్ని పొందడమనే ఘట్టం మహాభారతంలో ప్రాచుర్యం పొందింది.అర్జున వేషధారి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన తపస్మాన్ ను మెట్టు మెట్టుకు పద్యాలు పాడుతూ అధిరోహించారు.అర్జునుడు మంత్రించి తపాస్మన్ నుంచి వెదజల్లే నిమ్మకాలక కోసం భక్తులు పోటీలు పడ్డారు.ఈ నిమ్మకాయలు తింటే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో వుంది.తొలుత అర్జునుడి ఉత్వవమూర్తిని ఆలయం నుంచి విశేషఅలంకారంలో చప్పరంపై అధిరోహించి ఉరేగింపుగా తపస్మన్ వద్దకు తీసుకుని వచ్చి కొలువుదీర్చారు..ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.