AMARAVATHIDISTRICTS

17న కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ జిల్లాకు రాక- కలెక్టర్ హరినారాయణన్

తాత్కాలికంగా VRC కళాశాలలో ఏర్పాటు..

నెల్లూరు: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వెంకటాచలం మండలం కనుపూరు బిట్-2 గ్రామంలో  ఏర్పాటు చేయనున్న ప్రాంతీయ విద్యా కేంద్రం భవన నిర్మాణానికి స్థలాన్ని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ సోమవారం పరిశీలించారు.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పాండిచ్చేరి రాష్ట్రాలకు సంబంధించి ప్రాంతీయ విద్యా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిందన్నారు..ఈ నేపథ్యంలో భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని కనుపూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ పరిశీలించి, రైతులతో మాట్లాడారు..భవన నిర్మాణాలకు స్థలం అవసరమని, రైతుల భూములకు ప్రభుత్వం నుంచి మంచి ధర ఇప్పిస్తామని, రైతులందరూ విద్యా కేంద్రం ఏర్పాటుకు భూములిచ్చి సహకరించాలని కలెక్టర్ కోరారు. అనంతరం నెల్లూరు నగరంలోని VRC కళాశాలలో ప్రాంతీయ విద్యా కేంద్రం తాత్కాలికంగా ఏర్పాటుకు  భవనాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రాంతీయ విద్యా కేంద్రం ఏర్పాటుకు అన్ని వసతులతో తాత్కాలిక గదులను కేటాయించాలని VRC కళాశాల ప్రిన్సిపాల్ కు సూచించారు.

రాష్ట్రస్థాయి సదస్సు:- నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ (జాతీయస్థాయిలో పాఠ్యాంశాల కూర్పు) పై నెల్లూరు శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో నిర్వహించే రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొంటారని, ఈ సదస్సుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, ఏపీసీలు, ఆర్జేడీలు, డైట్ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ సదస్సు అనంతరం VRC కళాశాలలో ప్రాంతీయ విద్యా కేంద్రం ఏర్పాటుకు తాత్కాలిక భవనాలను సంజయ్ కుమార్ పరిశీలిస్తారన్నారు..కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్, డిఇఓ గంగా భవాని, తహశీల్దారు నరేష్ ఉన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *