AMARAVATHIDISTRICTS

ఎన్నికల విధులకు వెళ్లే వారి కోసం అన్ని బస్టాండ్ల నుంచి 255 బస్సులు-కలెక్టర్

బస్సులు బయలుదేరు వివరాలు..

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ విధులు కేటాయించబడిన పోలింగ్‌ అధికారులు, సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు 255 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌ తెలిపారు. జిల్లాలోని వివిధ బస్టాండ్ల నుండి సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల విధులు నిర్వహించేందుకు వెళ్లనున్న పోలింగ్‌ అధికారులు, సిబ్బంది ఇబ్బందులు లేకుండా సులభంగా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేలా అన్ని మార్గాల్లో రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 12వ తేదీ ఉదయం 6 గంటలకు సంబంధిత బస్టాండ్ల నుండి బస్సులు బయలుదేరతాయని, అదేవిధంగా 13వ తేదీ రాత్రి 10.30, 11.30, 12.30 గంటలకు తిరుగు ప్రయాణమవుతాయని చెప్పారు.

బస్సులు బయలుదేరు వివరాలు:-

నెల్లూరు మెయిన్‌ బస్టాండు నుండి కందుకూరుకు 19 బస్సులు, కావలికి 23 బస్సులు, ఆత్మకూరుకు 18 బస్సులు, ఉదయగిరికి 27 బస్సులు, సర్వేపల్లికి 16 బస్సులు బయలుదేరుతాయి.

కావలి మెయిన్‌ బస్‌స్టేషన్‌ నుంచి కందుకూరుకు 4 బస్సులు, ఆత్మకూరుకు 8 బస్సులు, కోవూరుకు 5 బస్సులు, నెల్లూరుకు 9 బస్సులు, సర్వేపల్లికి 5 బస్సులు, ఉదయగిరికి 5 బస్సులు బయలుదేరుతాయి.

కందుకూరు మెయిన్‌ బస్టాండు నుండి కావలికి 5 బస్సులు, ఆత్మకూరుకు 4 బస్సులు, కోవూరుకు 5 బస్సులు, నెల్లూరుకు 5, సర్వేపల్లికి 5, ఉదయగిరికి 5 బస్సులు బయలుదేరుతాయి.

ఆత్మకూరు మెయిన్‌ బస్టాండు నుంచి కావలికి 6 బస్సులు, కందుకూరుకు 8 బస్సులు, కోవూరుకు 6, నెల్లూరు 12, సర్వేపల్లికి 6, ఉదయగిరికి 6 బస్సులు బయలుదేరుతాయి.

ఉదయగిరి మెయిన్‌ బస్టాండు నుంచి కావలికి 8 బస్సులు, కందుకూరుకు 6 బస్సులు, కోవూరుకు 6, నెల్లూరుకు 11, సర్వేపల్లికి 5, ఆత్మకూరుకు 7 బస్సులు బయలుదేరుతాయి.

ఎన్నికల విధులు కేటాయించబడిన పోలింగ్‌ అధికారులు, సిబ్బంది అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని సకాలంలో పోలింగ్‌ కేంద్రాకు చేరుకోవాలని ఈ సందర్బంగా కలెక్టర్‌ సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *