AMARAVATHICRIMENATIONAL

మహిళలపై లైగింక వేధింపులకు పాల్పపడిన ? టీఎంసీ నేత షేక్ షాజహాన్ అరెస్ట్

అమరావతి: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు,,గుండాగిరి,, మహిళలపై లైగింక వేధింపులు,, భూ ఆక్రమణల రేషన్ బియ్యం పేదలకు అందకుండా చేస్తున్నడని ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ షాజహాన్‌ను తప్పని పరిస్థితుల్లో బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.. ఉత్తర 24 పరగణ జిల్లా మినాఖాలో ఓ ఇంట్లో దాక్కొని ఉన్న షాజహాన్‌ను గురువారం వేకువ జామున 3 గంటలకు అదుపులోకి తీసుకున్నమని,,వెంటనే బసిర్హత్ కోర్టులో హాజరు పరిచామని పోలీసులు మీడియాకు వెల్లడించారు..
షేక్ షాజహాన్, అతని అనుచరులు సందేశ్ ఖాలీలో మహిళలపై లైగింక వేధింపులు,,నిరుపేదలకు రేషన్ పంపిణీ చేయకుండా దారి మళ్లించిన కుంభకోణం బెంగాల్ లో తీవ్ర విమర్శలకు దారి తీసింది..సదరు స్కామ్‌నకు సంబంధించి 2024 జనవరి 5వ తేదీన విచారణ కోసం (ED) ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాజహాన్ ఇంటికి చేరుకున్నారు..ముందుగానే స్థానిక పోలీసుల నుంచి సమాచారం అందుకున్న షాజహాన్ అనుచరులు అధికారులపై రాళ్లతో,,,కర్రలతో దాడి చేశారు..ఈ దాడుల్లో ముగ్గురు ED అధికారులు తీవ్రంగా గాయపడ్డారు..తమపై దాడి తెగబడిన షాజహాన్,,అతని అనుచరులపై ED అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ED అధికారులు గాయపడడంతో,,కేసు తీవ్రత పెరిగే అశకాశం వున్న దృష్ట్య షాజహాన్ అక్కడి నుంచి పారిపోయాడు..ఈ సంఘటన తరువాత షాజహాన్‌ను అరెస్ట్ చేయాల్సిందేనని స్థానికులు ఆందోళనకు దిగారు..లైగింక వేధింపులకు,,రేషన్ బియ్యం మళ్లీంపుకు సంబంధించి బాధిత మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళన తీవ్రతరం చేశారు..ఈ విషయం తీవ్రత ఆర్దం చేసుకున్న కోల్ కతా హైకోర్టు స్పందించి,, షాజహాన్‌ను పోలీసులే కాకుండా దర్యాప్తు సంస్థలు CBI,,ED అరెస్ట్ చేయొచ్చని ఆదేశాలు జారీచేసింది..
తృణమూల్ కాంగ్రెస్:- నిరుపేదలకు కేద్రం పంపిణీ చేసే బియ్యంను వారికి చేరకుండా దారి మళ్లీంచి వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఈడీ అధికారులు నిగ్గు తేల్చారు..ఈ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన పెద్ద స్థాయి నాయకులు వున్నట్లు ఈడీ అనుమానిస్తొంది..బియ్యం దారి మళ్లీంపు కుంభకోణంను త్రవ్వి తీసేందుకు ఈడీ అధికారులు రంగంలోకి దిగడంతో,,ఇప్పటికే అవినితి ఆరోపణలతో జైల్లో చిప్పకూడు తింటున్న టీఎంసీ నాయకులకు తొడుగా మరి కొంత మంది పార్టీ నాయకులు జైలుకు పోవాల్సి వుంటుంది..త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి గడ్డుకాలం తప్పదని భావించిన,,తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ,,ఇన్ని రోజులు షాజహాన్‌కు అండగా నిలిచింది..అయితే మహిళలు రోడ్లపైకి రావడం,,హైకోర్టు జోక్యం చేసుకోవడంతో తప్పని సరి పరిస్థితుల్లో షాజహాన్‌ను అరెస్ట్ చేయించింది..షాజహాన్ ను ఈడీ అధికారులు విచారిస్తే,,వేల కోట్ల రూపాయలను బొక్కెసిన తృణమూల్ కాంగ్రెస్ నాయకులు బయటపడుతారు..చూడాలి ఈ కథ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందొ??

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *