మాల్దీవుల్లో ఘోర అగ్ని ప్రమాదం-9 మంది భారతీయులు మృతి

అమరావతి: మాల్దీవుల దేశ రాజధాని మాలేలోని ఓ బిల్డింగ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 10 మంది విదేశీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు పేర్కొన్నారు.మాలేలోని ఓ బిల్డింగ్ లో 10 మంది విదేశీ కార్మికులు నివాసం ఉంటున్నారు. ఉదయం ఆ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గ్యారేజీలో ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. క్షణాల వ్యవధిలోనే పై అంతస్థులకు వ్యాపించడంతో భవనం పై అంతస్థులో ఉన్న 10 మంది బయటకు రాలేకపోయారు. పొగ, మంట కారణంగా ప్రాణాలు వదిలారు. మృతుల్లో 9 మంది భారతీయులు ఉండగా, ఒకరు బంగ్లాదేశీ ఉన్నారు. మంటల్ని అదుపు చేసేందుకు 4 గంటల సమయం పట్టినట్లు ఫైర్ సెక్యూరిటీ అధికారులు చెప్పారు. అగ్ని ప్రమాద ఘటన మాల్దీవుల్లో విదేశీ కార్మికుల దుర్భర పరిస్థితికి అద్దం పడుతున్నాయని ఆ దేశ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మాలేలో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనపై ఇండియన్ హై కమిషన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించి మాల్దీవ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పింది.
Deadliest fire tragedy in the #Maldives. 11 dead bodies found so far. Reportedly all are migrant workers, packed in an overcrowded accommodation above a garage in the capital Male’ City. pic.twitter.com/Y9FhKSnDkz
— Save Maldives (@SaveMaldivess) November 10, 2022