CRIMEDISTRICTS

నాలుగురు లోన్ యాప్స్ నిర్వహికులు అరెస్ట్-ఎస్పీ విజయరావు

నెల్లూరు: లోన్ యాప్స్ నిర్వహికులతో కలసి పనిచేసిన నాలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి,యాప్ నిర్వహకులకు సంబంధించిన రూ.1.2 కోట్ల రూపాయలను బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ విజయరావు తెలిపారు.శనివారం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.నెల్లూరు నగరం, బాలాజీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అథిత్యనగర్ లో వుంటున్న కొండ్రెడ్డి.విద్యాసాగర్ రెడ్డి అనే యువకుడు లోన్ యాప్స్ నుంచి రూ.30 వేలు రుణం తీసుకున్నాడు.ఇతని వద్ద నుంచి లోన్ యాప్ నిర్వహికులు విడతల వారీగా దాదాపు రూ.40 లక్షలు వసూలు చేశారని బాలాజీ నగర్ పోలీసు స్టేషన్ లో సెప్టంబర్ 30వ తేదిన ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో హాంగ్ కాంగ్ కు చెందిన లీసా ద్వారా ఈ వ్యవహారం జరిగినట్లు గుర్తించడం జరిగింది.అమె తొలుత Instagram ద్వారా అజయ్ పవర్ కళ్యాణ్ (21) 3rd year NIT స్టూడెంట్, ఆలహాబాద్ యూనివర్సీటీ,ఉత్తరప్రదేశ్ లో చదువుతున్నాడు.ఇతనిని ముగ్గులోకి దింపింది.ఇతని ద్వారా కథ మొత్తం నడిపిందని,ఇందులో బాగంగా ప్రస్తుతం కళ్యాణ్ తో కలిపి మరో ముగ్గురుని అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు.డబ్బుతో అవసరం వున్న యువతను టార్గెట్ చేసి మెల్లగా ట్రాప్ చేస్తారని,అలా వారి కండీషన్స్ కు ఒప్పకున్న వారి మొబైల్స్ లో sms Lison అనే లోన్ APP mobileలో install అవుతుందన్నారు.ఒక సారి ఈ యాప్ install అయితే మీకు సంబంధించిన డేటా మొత్తం యాప నిర్వహకుల చేతిలోకి వెళ్లుతుందన్నారు.యాప్ నిర్వహకులు ఇచ్చిన మొత్తం కంటే ఎన్నో రేట్లు,లోన్ తీసుకున్న వారి నుంచి వసూలు చేస్తారని,అలా ఇవ్వలేని వారిని మానసికంగా బెదిరించిడం మొదలు పెడతారన్నారు.లోన్ తీసుకున్న వ్యక్తి డేటా మొత్తం యాప్ నిర్వహకుల వద్ద వుండడంతో,వారి మొబైల్ లో కాంటాక్టు నెంబర్లుకు అసభ్యమైన ఫోటోలను మార్పింగ్ చేసి,పోస్టు చేస్తారని తెలిపారు.ఇలా వీరి టర్చర్ తట్టుకోలేక చాలా మంది యువకులు ఆసువులు తీసుకున్నరన్నారు.యాప్ నిర్వహకుల ఆటకట్టించేందుకు చర్యలు ప్రారంభించడం జరిగిందన్నారు. అజయ్ పవర్ కళ్యాణ్ లో పాటు జాదవ్ యువరాజు(21) అదిలాబాద్,, రాథోడ్ సాయికిరణ్ (21) నిర్మల్,తెలంగాణ,,కర్ణాటకలోని చిక్ మంగుళూరుకు చెందిన అబ్దుల్(25) లను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.ఈ కేసులో మరో కీలకమైన వ్యక్తి వున్నరని,అతనిని అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నమన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *