AMARAVATHINATIONAL

సుప్రీమ్ కోర్టులో నేటి నుంచి ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి-సీ.జే

అమరావతి: వేసవి సెలవులు పూర్తి కావడంతో సుప్రీంకోర్టు సోమవారమే పునఃప్రారంభమైంది..సుప్రీమ్ కోర్టులో నేటి నుంచి ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ వెల్లడించారు..5 కోర్టు గదుల్లో ఈ ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తెచ్చామని,,బార్ రూమ్స్ లో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉందని పేర్కొన్నారు..డిజిటైజేషన్ దిశగా ఇది ముందడుగు అని,,ఇక నుంచి చట్టానికి సంబంధించిన పుస్తకాలు పేపర్లు కనిపించవన్నారు..ఇదే సమయంలో తాము పుస్తకాలు, పేపర్లపై ఆధారపడడం లేదని,,అర్ధం కాదని స్పష్టం చేశారు..కోర్టుకు వచ్చే లాయర్లు, మీడియా వ్యక్తులు సహా ఎవరైనా ఈ సేవలు వినియోగించుకోవంచ్చని సుప్రీంకోర్టు అధికారులు పేర్కొన్నారు..చీఫ్ జస్టీస్ కోర్టుతో సహా 2.3.4.5 కోర్టు గదుల్లో ఈ వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు..కోర్టు కారిడర్, ప్లాజా, వెయిటింగ్ ఏరియా, క్యాంటిన్ సహా ప్రెస్ లాన్-1.2 ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *