AMARAVATHITECHNOLOGY

భారత్ లో సెమీకండక్టర్స్ తయారీ చేస్తే,50% ఆర్థిక సహకారం-ప్రధాని మోదీ

అమరావతి: భారతదేశంలో సెమీకండక్టర్స్ తయారీ చేసేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు 50 శాతం ఆర్థిక సహకారం అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశాడు..శుక్రవారం గుజరాత్ లోని గాంధీనగర్లో సెమీకాన్ ఇండియా-2023 ప్రదర్శనను ప్రధాని మోడీ ప్రారంభించాడు..సెమీకండక్టర్స్ పరిశ్రమపై అవగాహన పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో పాల్గొన్నారు..ఈ సందర్భంగా సెమీకండక్టర్స్ తయారీదారులకు భారత ప్రభుత్వం రెడ్ కార్పరేట్ స్వాగతం పలుకుతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు..చిప్ డిజైనింగ్ పరిశ్రమల వృద్ధి అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పిస్తామన్నారు..సెమీకాన్ సదస్సు ద్వారా పోత్సహకాలు అందిస్తున్నట్లు తెలిపిన ప్రధాని మోడీ భారత్లోనే 300 కాలేజీలో సెమీకండక్టర్స్ తయారీ కోసం సంబంధిత కోర్స్ ను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.. దేశంలోనే సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో పరిశ్రమల ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను దేశ పారిశ్రామిక రంగానికి దోహదం చేస్తున్న ప్రభుత్వం వెల్లడించింది ఫాక్స్ క్రాన్,,మైక్రాన్,,AMD,,IBM Marvel,,వేదంత,,లామ్  రీసెర్చ్ లాంటి దిగ్గజ కంపెనీలుఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి..సెమీకండక్టర్స్ చిప్ డిజైన్,,డిస్ ప్లే ఫ్యాబ్,,అసెంబ్లింగ్ విభాగల్లో నిపుణులు భారత్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు..ప్రముఖ డిజైనింగ్ సంస్థ AMD భారత్లో 3200 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్మెంట్ చేయనున్నట్లు AMD ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ మార్క్ ఈ మేరకు ప్రకటన చేశారు..రాబోయే 5 సంవత్సరాల్లో బెంగళూరులో R & D క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు..ఈ క్యాంపస్ ద్వారా 3 వేల మంది ఇంజనీర్లకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *