AMARAVATHIDISTRICTS

మిచౌంగ్ తుఫాన్ నష్ట ప్రభవంపై కేంద్రంకు నివేదిక అందిస్తాం-రాజేంద్ర రత్నూ

నెల్లూరు: జిల్లాలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను, ప్రజలను ఉదారంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందిస్తామని జాతీయ ప్రకృతి విపత్తుల సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ పేర్కొన్నారు. జిల్లాలో తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు గురువారం విచ్చేసిన కేంద్ర బృంద సభ్యులు రాజేంద్ర రత్నూ, విక్రంసింగ్ కోవూరు, సర్వేపల్లి, నెల్లూరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలను పరిశీలించారు.అనంతరం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు. ఆయా శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించి జరిగిన నష్టాన్ని కేంద్ర బృంద సభ్యులకు క్లుప్తంగా వివరించారు.

ఈ సందర్భంగా రాజేంద్ర రత్నూ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించామని, అధికారులు తాత్కాలికంగా చూపిన నష్టం వివరాలను పరిశీలించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 9 జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయని, తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టాన్ని అంచనా వేసి, రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నివేదికలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకారం తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. తుఫాన్ ప్రభావంతో వ్యవసాయ,ఉద్యానవన పంటలు, మత్స్య, పాడి పరిశ్రమ, విద్యుత్, హౌసింగ్ శాఖలకు నష్టం వాటిల్లిందని, నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *