AMARAVATHIPOLITICS

కర్ణాటకలో అదాయ పన్ను శాఖ అధికారులు దాడులు,పట్టుబడ్డ రూ.42 కోట్లు

ఐదు రాష్ట్రాల్లో డబ్బు పంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తొంది.
అమరావతి: కర్ణాటకలో అదాయ పన్ను శాఖ అధికారులు గురువారం ఆర్దరాత్రి ఆకస్మికంగా మాజీ మహిళ కార్పొరేటర్, R.T నగర్లో నివాసం వుంటున్న అశ్వతమ్మ, ఆమె భర్త అంబికాపతి, వారి కుమార్తె,, అశ్వతమ్మ బావమరిది ప్రదీప్,మరో 7 గురు కాంట్రాక్టర్ల ఇళ్లల్లో దాడులు నిర్వహించారు..ఏక కాలం 12 జరిగిన ఈ దాడుల్లో కొనసాగించారు..ఈ దాడుల్లో అంబికాపతి నివాసంలో నుంచి 23 అట్టపెట్టెలు స్వాధీనం చేసుకున్నారు.. వీటిలో సుమారు 42 కోట్ల రూపాయలు ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు.. అంబికాపతికి సంబంధించిన ఒక ప్లాట్ పై అనుమానంతో,ప్లాట్ తలుపులు తెరవమని ఐటీ ఆధికారులు కోరగా తొలుత నిరాకంరించిన అంబికపాతి ఎట్టకేలకు తాళం తీశాడు..బబెడ్ రూమ్ లో వున్న 23 అట్టపెట్టలను ఓపెన్ చేసి చూడగా,అందులో రూ.500 నోట్ల కట్టలను చూసి ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు షాక్ అయ్యారు.
ఎవరీ అంబికాపతి:- కర్ణాటకలో పట్టుబడిన ఈ డబ్బంతా తర్వలో ఎన్నికలు జరుగుతున్న తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలకు తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేసినట్లు విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.. తెలంగాణ కాంగ్రెస్ కు రూ. 25 కోట్ల రూపాయలు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని కర్ణాటక భారతీయ జనతా పార్టీ నేత మునిరత్న ఆరోపించారు..తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఈ డబ్బులు పంచాలని కాంగ్రెస్ భావించిందనీ,, నవంబర్ 9 లోపు 100 కోట్ల రూపాయలు తెలంగాణకు తరలించారనుకుంటున్నారని మండిపడ్డారు.. గతంలో కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీజేపీ ప్రభుత్వంపై కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అంబికాపతి ఆరోపణలు చేశారు.. కాంట్రాక్టులు పనులు కేటాయించేందుకు 40 శాతం కమిషన్ ఇవ్వాల్సిందిగా అప్పటి బీజేపీ ప్రభుత్వంలోని నేతలు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ,, కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబికాపతి భారీ ఆందోళన చేపట్టారు.. అయితే కాంట్రాక్టర్ల ఆరోపణలపై అప్పటి బీజేపీ మంత్రి మునిరత్న పరువునష్టం కేసు దాఖలు చేశారు..ఆ కేసులో అంబికాపతిని అరెస్ట్ చేయగా, ఆ తరువాత అయన బెయిల్ పై విడుదల అయ్యారు.
హరీష్ రావు:- ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు కూడా స్పందిస్తూ, బెంగళూరు ఐటీ దాడుల్లో కాంగ్రెస్ డబ్బులు బయటపడ్డాయని హరీష్ రావు ఆరోపించారు.. తెలంగాణలో డబ్బులు పంచి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని హరీష్ విరుచుకుపడ్డారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *