AMARAVATHINATIONAL

ప్రకృతి, సంస్కృతి రెండింటినీ జాగ్రత్తగా కాపాడుకుంటు అభివృద్ది సాధిస్తాం-ప్రధాని మోదీ

అమరావతి: తమ ప్రభుత్వ తొమ్మిదేళ్ల కాలంలో “దేశ ఆర్థిక వృద్ధి,,రాజకీయ స్థిరత్వం“ అనే రెండు పరిణామాలను సమానమైన మార్గం ముందుకు తీసుకుని వెళ్లుతున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు..పిటీఐకి ఇచ్చిన ఇంటర్వులో అయన మాట్లాడుతూ భారత్ లో ఎక్కడైనా సమావేశాలు నిర్వహిస్తామని,,జీ-20 సమావేశాలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు..2047 నాటికి భారతదేశం అవినీతి,,కులతత్వం,, మతతత్వం లేని అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు..
ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక మందగమనం,, తీవ్రమైన కొరత,, అధిక ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టడుతూంటే,, భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలించిందన్నారు..అత్యధిక యువత వున్న దేశంగా భారత్ ఉందన్నారు..

చరిత్రలో భారతదేశం చాలా కాలం పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అగ్రగామిగా ఉందని,,ఆటు తరువాత వలసవాద ప్రభావం కారణంగా మన ఆర్దిక వ్యవస్థ మందగించిందన్న విషయంను ప్రధాని మోదీ గుర్తు చేశారు..10 సంవత్సరాల క్రిందట ప్రపంచంలోని 10వ ఆర్థిక వ్యవస్థగా వున్న భారత్ ఒక్కసారిగా 5వ స్థానానికి చేరుకుందన్నారు..భారతదేశ ప్రజలు కష్టించే విధానం,,వారు పని తీరును ప్రపంచంకు చూపిస్తున్నరని అన్నారు..

2021-22 ఆర్థిక సంవత్సరం చివరినాటికి 3.39 ట్రిలియన్ డాలర్ల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో బ్రిటన్ ను వెనక్కి నెట్టి, భారతదేశం ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ హోదాను సాధించిందని,,ప్రస్తుతం భారత్ కంటే అమెరికా, చైనా, జపాన్, జర్మనీ మాత్రమే ముందున్నాయని వెల్లడించారు..

2014 కంటే ముందు 3 దశాబ్దాలలో కాలంలో దేశంలో అస్థిరమైన అనేక ప్రభుత్వాలు వచ్చాయని, వాటి కారణంగా సదరు ప్రభుత్వాలు పెద్ద నిర్ణయాలను తీసుకొలేక పోయారని తెలిపారు..అయితే గత 9 సంవత్సరాలుగా ప్రజలు నిర్ణయాత్మకమైన ఆదేశాన్ని (బీజేపీకి) ఇచ్చారని, దీని కారణంగా దేశంలో సుస్థిర ప్రభుత్వం కారణంగా అనేక సంస్కరణలు అమలు చేయగలిగేమని పేర్కొన్నారు..

మన దేశంలో అవినీతి, కులతత్వం, మతతత్వానికి చోటు ఉండదని ప్రధాని మోదీ అన్నారు..మన దేశ ప్రజల జీవన నాణ్యత, ప్రపంచంలోని ప్రముఖ దేశాలతో సమానంగా ఉంటుందన్నారు..అన్నింటి కంటే ముఖ్యంగా ప్రకృతి, సంస్కృతి రెండింటినీ జాగ్రత్తగా కాపాడుకొవడం ద్వారా మేము దీనిని సాధిస్తామన్నారు..2028 నాటికి భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) జపాన్, జర్మనీ దేశాలను దాటుకుని 5 ట్రిలియన్ లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *