ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్రకు అడుగు దూరంలో భారత షట్లర్లు

అమరావతి: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు చరిత్ర సృష్టించారు. సాత్విక్ రాజు,,చిరాగ్ శెట్టి వరల్డ్ ఛాంపియన్ షిప్ క్వార్టర్స్ లో గెలిచి సెమీస్ లో అడుగుపెట్టారు.. మెడల్ కన్ఫర్మ్ చేసుకున్నారు. టోక్యో వేదికగా శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్‌లో జపాన్ బ్యాడ్మింటన్ జోడీతో తలపడి ఈ రికార్డు సాధించింది..దీంతో భారత బ్యాడ్మింటన్ చరిత్రలో వరల్డ్ ఛాంపియన్ షిప్ పురుషుల డబుల్స్ విభాగంలో తొలిసారి పతకం అందుకోనున్న జంటగా సాత్విక్, చిరాగ్ శెట్టి జోడీ నిలిచిందని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది..BWF వరల్డ్ చాంపియన్‌షిప్-2022లో భాగంగా చిరాగ్ శెట్టి- సాత్విక్‌సాయిరాజుల టీమ్,,రెండో సీడ్ టకురో హోకి- యుగో కొబయాషి(జపాన్)తో క్వార్టర్ ఫైనల్లో తలపడింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్ తొలి గేమ్‌లో తీవ్ర ప్రతీఘటన ఎదురైనా, భారత జోడీ 24-22తో పైచేయి సాధించింది. రెండో గేమ్‌లో మాత్రం జపాన్ షట్లర్ల ద్వయం,చిరాగ్- సాత్విక్‌లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా,, 21-15తో ఓడించింది. తిరిగి పుంజుకున్న భారత జంట 21-14తో టకురో హోకి- యుగో కొబయాషిలపై పట్టు బిగించి విజయం సాధించారు..దింతో సెమీఫైనల్ కు చేరి కాంస్య పతకం ఖాయం చేసుకున్నారు..
✅ First 🇮🇳 MD pair to secure a #BWFWorldChampionships medal
✅ Only 2nd #WorldChampionships medal from 🇮🇳 doubles pair
✅ 13th medal for 🇮🇳 at World's@satwiksairaj & @Shettychirag04 script history yet again 😍#BWFWorldChampionships2022#BWC2022#Tokyo2022#IndiaontheRise pic.twitter.com/POW0uYt7KC
— BAI Media (@BAI_Media) August 26, 2022