AMARAVATHIEDUCATION JOBS

పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పపడితే జైలు శిక్షతో పాటు రూ.1 కోటి జరిమానా

అమరావతి: పోటీ పరీక్షల్లో చోటు చేసుకుంటున్న అక్రమాల పట్ల కఠినంగా వ్యవహారించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒక కొత్త బిల్లును తీసుకుని వచ్చింది..మాల్ ప్రాక్టీస్ కి పాల్పడే అక్రమార్కులను అడ్డుకోవడం కోసం, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (Prevention of Undefinable Means) బిల్లును కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లోక్ సభలో ప్రవేశపెట్టారు.. ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు ప్రకారం, ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై పరీక్ష పత్రాలను లీక్ చేసిన వారికి లేదా జవాబు పత్రాలను తారుమారు చేసిన వారికి మాత్రమే 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1 కోటి జరిమానా విధించబడుతుంది..ఈ బిల్లు కింద నేరాలన్ని నాన్-బెయిలబుల్, నాన్-కాంపౌండ్. ఆఫెన్స్ క్రింద పోలీసులకు వారెంట్ లేకుండానే అనుమానుతుల్ని అరెస్ట్ చేయొచ్చు..నిందితుడికి బెయిల్ కు అర్హత ఉండదు.. ఆరోపణలు రాజీ ద్వారా పరిష్కరించేందుకు అవకాశం వుండదు.. రాజస్థాన్, హరియాణా, గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాలు లీకేజీల కారణంగా పోటీ పరీక్షలు వాయిదా పడుతున్న సమయంలో కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
ఏ పరీక్షలు ఈ కొత్త బిల్లు పరిధిలోకి వస్తాయి అంటే:- 1- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్,,2- స్టాఫ్ సెలక్షన్ కమీషన్,,3- రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డులు,,4- ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్,,5- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ,తదితర పరీక్షలు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *