AGRICULTUREAMARAVATHIDISTRICTS

జిల్లాలో ఆశించిన స్థాయిలో కురువని వార్షాలు-ఆలస్యంగా సాగునీటి సలహా మండలి సమావేశం

జిల్లాలో కరువు మండలాలు ?  

నెల్లూరు: ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో దాదాపు 3 వారాల ఆలస్యం జరుగుతొంది..అక్టోబరు చివరి వారం జరగాల్సిన సలహా మండలి సమావేశం ఆలస్యం కావడంతో,,రైతులు ఖరీప్ పంట వేసేందుకు తటపటాయిస్తున్నారు..జిల్లాలో ఖరీప్ సీజన్ లో దాదాపు 5.5 లక్షల ఎకరల్లో వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్దం అవుతారు..అయితే సోమశిల జలాశయంలో నీటి నిల్వలు ఎంత వున్నాయి ? సాగు నీటి సలహా మండలి,,డ్యాంలో నీటి నిల్వవున్న దృష్టిలో వుంచుకుని ఎన్ని TMCలు కేటాయిస్తుందొ తెలియక పోవడంతో రైతులు అయోమయంలో వున్నారు..10 వేల ఎకరలు సాగు చేసేందుకు 1 TMCల నీరు సరిపోతుంది.. నవంబరు రెండో వారం వచ్చేసింది..విశాఖ కార్తీ కూడా దాటిపోయిన జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు..ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితిలు నెలకొని వున్నాయని,,ప్రభుత్వం రైతుల దీనస్థితిని దృష్టిలో వుంచుకుని కరువు మండలాలు ప్రకటించాల్సి వున్నదని మాజీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు..నెల్లూరుజిల్లాలో 47 మండలలు వుండగా వాటిలో ఎన్ని మండలల్లో కరువు పరిస్థితిలు నెలకొని వున్నాయి అనేది ఇప్పటి వరకు ప్రకటించలేదంటే,, అధికారుల ఆలసత్వమా ? లేక నాయకులు నిర్లలక్ష్యమా ? అనే విషయం గురించి రైతులు ఆలోచించాల్సి అవసరం వుందన్నారు.. జిల్లాలో సాగునీటి సలహా మండలి సమావేశంలో మూడు వారలు ఆలస్యం నిర్వహిస్తే,,దాని ప్రభావం నారుమళ్లపై వుంటుందని,,ఆలస్యంగా నారుమళ్లు వేస్తే,,ఖరీప్ ఏప్రిల్ నాటికి చేతికి రాల్సిన పంట,,మే చివరకి వెళ్లుతుందన్నారు సోమిరెడ్డి..పర్యావసనంగా మే నెలలో ఆకాల వర్షాలు కురుస్తే,,చేతికి వచ్చే పంట దెబ్దతిని రైతు తీవ్రంగా నష్టపోతారని అవేధన వ్యక్తం చేశారు..ఆసలు జిల్లాలో కరువు మండలాలు వున్నాయా ?వుంటే ఎన్ని మండలాల్లో కరువు మండలాల క్రింద పరిగణించారో వెంటనే రైతులకు తెలిపాల్సి అవసరం వుందన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *