AMARAVATHI

తెలుగు భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రజలందరిపైన వుంది-పవన్

అమరావతి: తెలుగు భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రజలందరిపైన వుందని,,మాట్లాడే భాష,,రాసే భాష ఒకటి కావాలని తపించి,,ఆ దిశగా వ్యవహారిక భాషోద్యమాన్ని నడిపిన గిడుగు వెంకట రామమూర్తిని తెలుగు జాతి ఎన్నడూ మరువకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.. మంగళవారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకట రామమూర్తికి సభక్తికంగా అంజలి ఘటిస్తున్నానన్నారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల భాషలోకి తీసుకువచ్చి మన మాతృభాషకు జీవంపోశారని జనసేనాని కొనియాడారు.. ఆంధ్ర ప్రదేశ్ పాలకుడికి ఎలాగూ తెలుగు అంటే ఆసక్తి లేదని, కాబట్టి ప్రజలే తెలుగు భాషను కాపాడుకొనే బాధ్యతను స్వీకరించాలన్నారు..తెలుగు భాష అభివృద్ధి కోసం ఏర్పాటైన ప్రభుత్వ విభాగాల పని తీరును గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిదని వ్యాఖ్యనించారు..వారు విడుదల చేసే ప్రకటనల్లోనూ, విద్యా శాఖ నుంచి వచ్చే ప్రకటనల్లో ఎన్ని అక్షర దోషాలు ఉంటున్నాయో చూస్తేనే తెలుస్తోందని, అలాంటి వారి నుంచి భాషా వికాసాన్ని ఆశించలేమని అన్నారు..వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడైన గిడుగు వెంకట రామమూర్తి స్ఫూర్తిని తెలుగు భాషాభిమానులు, అధ్యాపకులు, సాహితీవేత్తలు అందిపుచ్చుకోవాలన్నారు. చిన్నారులు ఓనమాలు నేర్చుకొనే దశ నుంచే మన మాతృ భాషను దూరం చేసే విధంగా ఉన్న పాలకుల తీరు వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని పవన్ కల్యాణ్ పిలుపిచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *