జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈడీ సోదాలు

మైనింగ్ కుంభకోణం ఆరోపణలు..
అమరావతి: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో పాటు ఆయన సన్నిహితుల నివాసల పై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహిస్తోంది.. టెండర్ స్కామ్ వ్యవహారంలో భాగంగా సాహిబ్‌గంజ్, బెర్హైత్, రాజ్‌మహల్ తో పాటుగా 18 ప్రాంతల్లో శుక్రవారం వేకువరుజాము నుంచే ED సోదాలు చేస్తోంది..సీఎం సోరెన్ ప్రతినిధి పంకజ్ మిశ్రా నివాసల్లో కూడా విస్తృతంగా ED తనిఖీలు నిర్వహిస్తోంది..సోదాల సమయంలో ED అధికారులు పారామిలటరీ బలగాల సాయం తీసుకున్నారు..ఇప్పటికే సీఎం సోరెన్‌పై మైనింగ్ కుంభకోణం ఆరోపణలు వచ్చాయి..ఈ ఆరోపణలపై హేమంత్ సోరెన్ కు ED ఇప్పటికే నోటీసులు జారీ చేసింది..