AMARAVATHIPOLITICS

రామాస్వామి నాయకర్ (పెరియార్) విగ్రహాలను తొలగించేస్తాం-అన్నమలై

తమిళనాడులో దేవాలయాల ముందు…

అమరావతి: తమిళనాడులో దేవాలయాల ముందు ఉన్నరామాస్వామి నాయకర్ (పెరియార్) విగ్రహాలను తొలగించేస్తామని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై సంచలన వ్యాఖ్యలు చేశారు..బుధవారం నామట్టి-నాప్రజలు (ఎన్ మన్,,ఎన్ మక్కల్) పాధయాత్రలో బాగంగా శ్రీరంగం పట్నంకు చేరుకున్న అన్నమలై అక్కడ నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ “ద్రావిడ వాదంతో అధికారంలోకి వచ్చిన (DMK) పార్టీని” టార్గెట్ చేస్తు రాష్ట్రంలో బీజెపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేసే మొట్టమొదటి పనే అదేనని తేల్చి చెప్పారు.. పెరియార్ విగ్రహాలకు బదులుగా అళ్వార్, నాయనార్లతో పాటు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను ప్రతిష్టిస్తామన్నారు.. అలాగే అయోధ్య భవ్య రామామందిరం ప్రారంభం అయిన తరువాత శ్రీరాముడిని దర్శించుకునేందుకు భక్తులకు 100 రోజుల పాటు ఒక ట్రైయిన్ ఫ్రీగా తమిళనాడు నుంచి అయోధ్యకు ఏర్పాటు చేస్తామన్నారు.. (HR & CE) హిందు రిలిజియ్స్ ఛారిటబుల్ ఎండోమెంట్ డిపార్ట్ మెంట్(దేవాదాయ ధర్మాదాయశాఖ) శాఖను సైతం రద్దు చేస్తామని హామీ ఇచ్చారు..ఈ మంత్రిత్వ శాఖ చివరి రోజు,, బీజేపీ ప్రభుత్వపు తొలి రోజు అవుతుందని స్పష్టం చేశారు.. 1967లో చోటు చేసుకున్న ఒక సంఘటనను అన్నామలై గుర్తు చేసుకుంటూ ‘‘డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు,, పెరియార్ ప్రవచానలతో చెక్కబడిన ఫలకాలను ఏర్పాటు చేసింది… ఆ ఫలకాల్లో “దేవుళ్లను అనుసరించే వాళ్లు మూర్ఖులు, దేవుళ్లను నమ్మేవారు మోసగించబడతారు, కాబట్టి దేవుడ్ని పూజించకండి” అని డీఎంకే పార్టీ ముద్రించింది… ఈ ఫలకాలను తమిళనాడు వ్యాప్తంగా ఉన్న దేవాలయాల ముందు ఏర్పాటు చేసిందని అన్నమలై వెల్లడించారు.. హిందూ దేవుళ్లను డీఎంకే పార్టీ అనుమానించిందని, అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెరియార్ విగ్రహాల్ని తొలగించేస్తామని ఆయన మాటిచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *