జైళ్లల్లో నుంచే దాందా..
అమరావతి: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బలవంతపూ వసుళ్లూ,,నేరాలు పెరిగిపొతున్న నేపథ్యంలో జాతీయ పరిశోధనా సంస్థ(NIA) దేశంలోని 60ప్రాంతాల్లో సోమవారం NIA అధికారులు పలు గ్యాంగ్ స్టార్స్,, మాఫీయా సిండికేట్ల స్థావరాలపై ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్,,హర్యానా,,ఉత్తరప్రదేశ్,, పంజాబ్ రాష్ట్రాల్లో NIA అధికారులు దాడులు జరిపారు..ఢిల్లీలో నేరాలు సాగిస్తు పేట్రేగిపోతున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బంబిహా,, నీరజ్ బవానా గ్యాంగులకు చెందిన 10 మంది గ్యాంగ్ స్టర్లపై ఇటీవల కాలంలో ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఉపా (Unlawful Activities (Prevention) Act (UAPA), కింద కేసులు నమోదు చేశాక NIA దర్యాప్తు ఆరంభించింది..సిద్ధూ మూసే వాలా హత్య కేసులో గ్యాంగస్టర్లకు, ఉగ్రవాదులకు మధ్య సంబంధాలున్నాయని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ పేర్కొన్నారు.. నీరజ్ షేరావత్ అలియాస్ నీరజ్ బవానా గ్యాంగ్ ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుందని,, నీరజ్ బవానా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగుల మధ్య అధిపత్య పోరు సాగుతుందని దర్యాప్తులో తేలినట్లు NIA అధికారులు పేర్కొన్నారు..అలాగే దేశంలో గ్యాంగ్ స్టార్స్,, జైళ్లలో నుంచి తమ కార్యకలాపాలు సాగిస్తున్నారని NIA అధికారుల దాడుల్లో కనుగొన్నారు.. భారతదేశంతోపాటు కెనడా, పాకిస్థాన్, దుబాయ్ దేశాల్లోని జైళ్లలో ఉన్న గ్యాంగ్ స్టార్స్,, లారెన్స్ బిష్ణోయ్, గోల్డియా బ్రార్, విక్రం బ్రార్, జగ్గు భగవాన్ పురియా, సందీప్, సచిన్ తాపన్, అనమోల్ బిష్ణోయ్ లు వారి గ్యాంగుల కార్యకలాపాలను లోపల నుంచి సాగిస్తున్నారని NIA అధికారుల సోదాల్లో తేలింది..తీహార్, హర్యానా జైళ్లలో ఉన్న కౌషల్ చౌదరి, లక్కీ పాటియాల్, లారెన్స్ బిష్ణోయ్, బాంబిహా గ్యాంగ్ లపై కూడా (Unlawful Activities (Prevention) Act (UAPA) కింద కేసులు పెట్టాలని NIA నిర్ణయించినట్లు సమాచారం..