AMARAVATHINATIONAL

MPలు,MLAలకు లంచాల కేసుల్లో మినహాయింపు లేదు-సుప్రీమ్ కోర్టు

అమరావతి: ఎంపీలు,,ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో ఏడుగురు సభ్యుల కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది..లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్, పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలా, సంజయ్ కుమార్, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది..గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసింది..అసెంబ్లీ, పార్లమెంట్ లో లంచాలకు పాల్పడే ప్రజాప్రతినిధులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఏడుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 194(2), ఆర్టికల్ 105(2) ప్రకారం సభలో చేసిన ఏ ప్రసంగం లేదా ఓటువేసినా క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు వ్యతిరేకంగా పార్లమెంటు సభ్యులకుఉన్న మినహాయింపు ఇక చెల్లదని సుప్రీంకోర్టు పేర్కొంది..
లంచం తీసుకొని శాసన సభ,,పార్లమెంట్ లో మాట్లాడటం,, ఓటు వేయడం నెరపురిత చర్య అని,, ప్రజాప్రతినిధి లంచం తీసుకోవటం నేరం అన్నది..పీవీ నర్సింహ తీర్పు ఆర్టికల్స్ 105/194కు విరుద్ధం అని సుప్రీంకోర్టు పేర్కొంది..లంచం పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షించబడదని,, శాసన అధికారాల ఉద్దేశం, లక్ష్యం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేసింది..అధికారాలు సమిష్టిగా చట్టసభకు ఉంటాయన్నాది..ఆర్టికల్ 105/194 సభ్యులకు నిర్భయ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.. అవినీతి,, శాసనసభ్యుల లంచం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తుందని వ్యాఖ్యనించింది.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి లంచం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు అవినీతి నిరోధక చట్టం కింద కూడా బాధ్యులవుతారని సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టం చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *