AMARAVATHINATIONAL

స‌నాత‌న ధ‌ర్మం గురించి ఉద‌య‌నిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హాం

అమరావతి: స‌నాత‌న ధ‌ర్మాన్ని డెంగ్యూ, మ‌లేరియాతో పోల్చి,,వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది..సోమవారం జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా,, దీపాంక‌ర్ ద‌త్తాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఉద‌య‌నిధి పిటీష‌న్‌ను విచారించింది.. ఉద‌య‌నిధి స్టాలిన్‌ తరపును అభిషేక్ మను సింఘ్వీ హాజరు అయ్యారు..మీరు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి మ‌ళ్లీ కోర్టును ఎలా ఆశ్ర‌యిస్తున్నార‌ని సుప్రీం బెంచ్ ప్ర‌శ్నించింది..మీరు మాట్లాడే మాట‌ల ప‌ర్యవ‌సానాలు ఎలా ఉంటాయో మీకు తెలిసి ఉండాల‌ని కోర్టు పేర్కొంది..రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 19(1) ప్ర‌కారం మీరు మీకు హ‌క్కును దుర్వినియోగం చేశార‌ని,, ఆర్టిక‌ల్ 25 ను కూడా దుర్వినియోగం చేశార‌ని,,ఇప్పుడు ఆర్టిక‌ల్ 32 ప్ర‌కారం మీరు సుప్రీంలో పిల్ దాఖ‌లు చేశార‌ని వ్యాఖ్యనిస్తూ,, మీరు మాట్లాడిన మాట‌ల ప‌ర్య‌వ‌సానాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా, మీరేమీ సాధార‌ణ వ్య‌క్తి కాదని,,మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మీరు మాట‌ల ప‌ర్య‌వ‌సానాలు తెలిసి ఉండాల‌ని సుప్రీం బెంచ్ అక్షేపించింది..కేసును మార్చి 15వ తేదీకి వాయిదా వేశారు.. గ‌త సంవత్సరం సెప్టెంబ‌ర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో స‌నాత‌నం ధ‌ర్మంపై స్టాలిన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.. సామాజిక న్యాయానికి,, స‌మాన‌త్వానికి స‌నాత‌న ధ‌ర్మం వ్య‌తిరేకం అన్నారు..స‌నాత‌న ధ‌ర్మాన్ని డెంగ్యూ, మ‌లేరియాతో పోల్చి,,నిర్మూలించాల‌న్నారు..ఈ వ్యాఖ్యలపై తమిళనాడు,,మహారాష్ట్ర,,జమ్ము,కాశ్మీర్,,ఉత్తర ప్రదేశ్,,బీహర్,,కర్ణాటకలో ఉదయనిదిపై కేసులు నమోదు అయ్యాయి..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *