ఉగ్రదాడులు జరిగేవరకు ఎదురుచూడటం కాదు-వారిని వెంబడించి మట్టుపెట్టాలి-ప్రధాని మోదీ

అమరావతి: ఉగ్రదాడులు జరిగేవరకు ఎదురుచూడటం సరికాదని,మనమే వారిని వెంబడించి మట్టుపెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు.ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించే వరకూ తమ ప్రభుత్వం విశ్రాంతి తీసుకోబోదని స్పష్టం చేశారు.శుక్రవారం ఉగ్రవాద తండాలకు నిధులను నిరోధించే ఆంశంపై ఢిల్లీ వేదికగా “నో మనీ ఫర్ టెర్రర్”అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు.ఈ సందర్బంలో ప్రధాని ప్రసంగిస్తూ గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశం అనేక విధాలుగా ఉగ్రదాడులను ఎదుర్కొంటొంది.ఎంతో మంది విలువైన ప్రాణాలను కోల్పోయింది,కానీ ఉగ్రవాదంపై ధైర్యంగా పోరాడుతొందన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేంతవరకు మేము విశ్రామించేది లేదన్నారు.ఉగ్రవాదంను అణిచివేసేందుకు వేగంగా స్పందించే వ్యవస్థ అవసరమని,మన ప్రజలు సురక్షితంగా వుండాలని కోరుకుంటే,తీవ్రవాదులు మన ఇంటిలోకి వచ్చే వరకు వేచి చూడకూదు,మనమే వారిని వెంబడించాలన్నారు. ఉగ్రదాడి ఏ ప్రాంతంలో జరిగినా,ఏ స్థాయిలో ఉన్న మన ప్రతిస్పందన మాత్రం తీవ్రంగా వుండాలన్నారు. ఉగ్రవాదులకు మద్దతూగా వున్న నెట్ వర్క్ లను విచ్చిన్నం చేయాలని,వారి అర్ధికవ్యవస్థలను దెబ్బకొట్టాలని స్పష్టం చేశారు.కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో భాగంగా తీవ్రవాదులకు అన్ని రకాలుగా మద్దతిస్తున్నాయని,అలాంటి దేశాలపై ఆర్దికపరమైన ఆంక్షలు విధించాల్సి అవసరం వుందన్నారు.ప్రత్యక్ష్యంగా లేక పరోక్షంగా విస్తారిస్తోన్న ఉగ్రవాదంపై పోరాడేందుకు ప్రపంచదేశాలన్ని ఏకమవ్వాలని కోరారు.రెండు రోజుల పాటు జరిగే “ నో మనీ ఫర్ టెర్రర్ ” సదస్సులో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మంత్రులతో పాటు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(FATA)సభ్యులు,పలు ఉగ్రనిరోధక సంస్థల అధినేతలతో కలిపి దాదాపు 450 మంత్రి ప్రతినిధులు పాల్గొంటున్నారు.