DISTRICTS

రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటున్న MLC అభ్యర్ది-మోహన్ రావు

నెల్లూరు: MLC ఎన్నికల ఓట్ల నమోదులో జరిగిన అక్రమాలపై , ఓట్లవెరిఫికేషన్ సందర్భంగా జరుగుతున్న లోపాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగిందని ఎన్నికల కమిటీ కన్వీనర్ ఎం.మోహన్ రావు తెలిపారు.ఎమ్మెల్సీఎన్నికల ఓట్ల నమోదులో బోగస్ సర్టిఫికెట్లుతో నమోదు జరిగి ఉన్నదని, టీచర్ ఓట్ల నమోదులో అధికార పార్టీ అండతో కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు నిబంధనలను ఉల్లంఘించి నమోదు చేశారన్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్టార్ నిబంధనలకు విరుద్ధంగా కౌంటర్ సైన్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని,వీటిపై విచారణ జరపాలని వినతి పత్రంలో పేర్కొవడం జరిగిందన్నారు.అధికార పార్టీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పి.చంద్రశేఖర్ రెడ్డి రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థను,జిల్లా కలెక్టర్ ని ఎన్నికల ప్రచార వీడియోలలో వాడుకుంటున్నారని, ఈ అధికార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు.ఓట్ల నమోదు వెరిఫికేషన్ సందర్భంగా B.L.Oలు చేయవలసిన పనులకు వాలంటీర్లను, అధికార పార్టీ ప్రజాప్రతినిధులను వినియోగించి వెరిఫికేషన్ లో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని, దానిని నివారించాలని కోరాడం జరిగిందని తెలిపారు.కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల అధికారికి ఈ వినతి పత్రాలను పంపించడం జరిగిందని పేర్కొన్నారు. ,ఉద్యోగ సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ ఆర్.నగేష్ ,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి.దయాకర్, ఎన్.స్వరాజ్ బాబు ఈ ప్రతినిధి వర్గంలో ఉన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *