సల్మాన్ రష్దీ త్వరగా కొలుకోవాలి-మాజీ భార్య పద్మాలక్ష్మి

అమరావతి: నవలా రచయిత సల్మాన్ రష్దీ శుక్రవారం రాత్రి కత్తిపోట్లకు గురై,,కోలుకుంటున్న సమయంలో అయన నాల్గవ మాజీ భార్య,, భారతీయ అమెరికన్ మోడల్,,టీవీ హోస్ట్,,రచయిత్రి పద్మా లక్ష్మి,,రష్దీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.. అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో ఒక సభలో ఉపన్యాసం ఇచ్చేందుక వెళ్లిన సమయంలో అయన కత్తిపోటు గురైయ్యారు..1999లో తొలి సారి వీరిద్దరు కలుసుకున్నారు..పద్మాలక్ష్మీని,రష్దీ 2004వ సంవత్సరంలో వివాహమాడారు..పెళ్లి అనంతరం సల్మాన్ రష్దీతో నాలుగేళ్ల పాటు కాపురం చేసిన అనంతరం ఇద్దరి మధ్య భేదాప్రాయలు రావడంతో 2007లో రష్దీ, పద్మాలక్ష్మీలు విడిపోయారు..రష్దీ గతంలో జాఫర్ తల్లి క్లారిస్సా లువార్డ్, ఎలిజబెత్ వెస్ట్ లను వివాహం చేసుకున్నాడు..రష్దీతో అతని 23 ఏళ్ల కుమారుడు మిలన్ రష్దీ ఉంటూన్నాడు..తన తండ్రి గురించి అతని పెద్ద కుమారుడు జాఫర్ రష్దీ ఒక ప్రకటన చేశాడు..”నా తండ్రి ఆసుపత్రిలో విస్తృతమైన వైద్య చికిత్స పొందుతున్నపుడు మొదట్లో పరిస్థితి విషమంగా ఉందని,,ప్రస్తుతం నా తండ్రికి వెంటిలేటర్ తొలగించినప్పుడు మాకు చాలా ఉపశమనం కలిగిందన్నారు..తండ్రి మాట్లాడుతున్నాడు అని జాఫర్ రష్దీ పేర్కొన్నాడు..