కేరళలో ఘనంగా ప్రారంభంమైన ఓణం పండుగ ఉత్సవాలు

అమరావతి: ఓనం-తిరువోణం-కేరళలో అతిపెద్ద పండుగ, దేవుని సొంత దేశం(God’s own country), రాష్ట్రమంతటా వర్గ, కుల,మతపరమైన అడ్డంకులు వున్నప్పటికి ప్రజాలు ఆనందోత్సహాల మధ్య ఓణం వేడుకలు జరుపుకుంటున్నారు.. ఎర్నాకులంలోని సుప్రసిద్ధ త్రికాకర ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పి.రాజీవ్ ఉదయం 11 గంటలకు వేడుకలు ప్రారంభించారు..
2018,, 2019లో కేరళలో వరుసగా రెండు వరదలు, అలాగే కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020,,2021 మరో రెండు సంవత్సరాలు అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు ప్రజలు ఇళ్లకే పరిమితమైన తరువాత, రాష్ట్ర సాంప్రదాయ పంట పండుగ అయిన ఓనం ఈసారి భిన్నంగా జరుగుతొంది..మలయాళీల నూతన సంవత్సరమైన ఓణం పండుగను
సాధారణంగా 10 రోజుల పాటు జరుపుకుంటారు..మూడు ముఖ్యమైన రోజులు బుధవారం, గురువారం తిరు ఓణం,,శుక్రవారం అవిట్టం..తిరు ఓణం, ఇతర రోజులలో ప్రధాన ఘట్టం 26-రకాల శాఖాహారం, ఇది అరటి ఆకుపై వడ్డిస్తారు..కుల, మతం,ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఇంటిలో జరుపుకుంటారు..
26 వంటకాల్లో నోరూరించే మధ్యాహ్న భోజనంలో చిప్స్, పప్పడ్‌లు, రకరకాల వెజిటబుల్ కర్రీలు, తీపి,పుల్లని పచ్చళ్లు, సంప్రదాయ అవియాల్, సాంబార్, పప్పు కొద్ది మొత్తంలో నెయ్యి, రసం, రెండు రకాల మజ్జిగతో వడ్డిస్తారు.తురిమిన కొబ్బరి నుండి తయారు చేసిన చట్నీ పొడి,పాయసాలను ఒంటరిగా లేదా పండిన చిన్న అరటితో కలిపి భోజనం చేస్తారు..వామనమూర్తి ఆలయంలో దాదాపు 20,000 మందికి “ఓనం సధ్య” అన్నదానం చేస్తారు.