AMARAVATHIINTERNATIONAL

అబుదాబిలో తొలి హిందూ దేవాలయం ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,,భారతదేశం మధ్య ప్రగాఢమైన స్నేహం కారణంగా,,ఇక్కడికి వచ్చిన తనకు స్వంత ప్రాంతంలో వున్న అనుభూతి కలుగుతొందని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు.. దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేపై అల్ రహ్బా సమీపంలో నిర్మించిన ఈ ఆలయాన్ని బోచసన్వాసి శ్రీఅక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ హిందూ దేవాలయంగా పిలుస్తున్నారు..దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయ పనులు 2019 సంవత్సరం నుంచి ప్రారంభం అయ్యాయి.. ఆలయ నిర్మాణం కోసం భూమిని యూఏఈ ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది.. ఈ ఆలయం మార్చి 1 నుంచి ప్రజల కోసం తెరవబడుతుంది..ఈ ఆలయ ప్రాకారంలో సందర్శకుల కేంద్రం,, ప్రార్థనా మందిరాలు,,ప్రదర్శనలు,, అభ్యాస ప్రాంతాలు,, క్రీడా ప్రాంతాలు ఏర్పాటు చేశారు..పిల్లలు, యువత కోసం ఫుడ్ కోర్టులు,, గిఫ్ట్ షాప్స్ తో సహా అనేక ఇతర సౌకర్యాలు అందుబాటు ఉన్నాయి.. అబుదాబిలో నిర్మించిన ఈ ఆలయాన్ని దాదాపు రూ.700 కోట్లతో BAPS సంస్థ ఆధ్వర్యంలో నిర్మించారు.. BAPS అనేది ప్రపంచవ్యాప్తంగా 1,100 కంటే ఎక్కువ హిందూ దేవాలయాలను నిర్మించిన సంస్థగా ప్రసిద్ధి గాంచింది..ఈ ఆలయం కాశీ విశ్వనాథ్ కారిడార్ కంటే చాలా విశాలమైంది..ఈ ఆలయం నిర్మాణంలో భాగంగా రాజస్థాన్‌ జైపూర్‌లోని గులాబీ ఇసుక రాళ్లను ఉపయోగించారు..ఆలయ మధ్య భాగంలో స్వామి నారాయణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు..అయోధ్యలో ఆలయాన్ని నిర్మాణంకు ఉపయోగించింది కూడా ఇదే రాయి కావడం గమనర్హం..పాలరాతితో చేసిన ఆలయంలోని ప్రతి స్తంభంపై హనుమాన్,,రామ్,సీతా, గణేష్ విగ్రహాలు చెక్కబడ్డాయి. ఆలయ వెలుపల వైపు స్తంభాలపై సీతా స్వయంవరం,,రామ వనగమన్,, కృష్ణ లీలలు మొదలైనవి ఉన్నాయి.. భారతదేశం, యూఏఈ సంస్కృతుల సంగమం నేపథ్యంలో ఆలయంలో 7 మినార్లు నిర్మించబడ్డాయి. ఈ ఆలయంలో ఎక్కువ ఉష్ణోగ్రతను కొలవడం, భూకంపం వంటి విపత్తులను పసికట్టేందుకు 300 హైటెక్ సెన్సార్లను అమర్చారు..ఆలయ నిర్మాణంలో ఎటువంటి మెటల్ ఉపయోగించబడలేదు..

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *