కాన్వాయ్ను రోడ్డు పక్కగా నిలిపివేసి అంబులెన్స్కు దారి ఇచ్చిన ప్రధాని మోదీ

అమరావతి: మన ముఖ్యమంత్రులు లేక మంత్రుల కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ను కనీసం 30 నిమిషాలు నిలిపేయడం సర్వసాధారణం. ప్రధాన మంత్రి నుంచి మంత్రుల వరకు ఎవరి కాన్వాయ్ రోడ్డుపైకి వచ్చినా ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పవు.రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్ కు వెళ్లారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన రోడ్డు మార్గంలో అహ్మదాబాద్ నుంచి గాంధీ నగర్కు బయలుదేరారు. అదే సమయంలో ఆయన కాన్వాయ్ వెనుక ఓ అంబులెన్స్ వస్తున్న విషయాన్ని ప్రధాని మోడీ గ్రహించారు. వీఐపీ ప్రోటోకాల్స్ ను పక్కనపెట్టి, వెంటనే తన కాన్వాయ్ను రోడ్డు పక్కగా నిలిపివేయించారు. అంబులెన్స్కు దారి ఇచ్చారు. అంబులెన్స్ ముందుకు వెళ్లిన తర్వాత తిరిగి బయలుదేరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi, en route from Ahmedabad to Gandhinagar, stopped his convoy to give way to an ambulance pic.twitter.com/yY16G0UYjJ
— ANI (@ANI) September 30, 2022