6వ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం మహారాష్ట్ర, నాగ్‌పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకు స్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. నాగ్‌పూర్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్ పూర్ మధ్య ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని ప్రారంభించారు.దింతో దేశంలో అందుబాటులోకి వచ్చిన 6వ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు…అనంతరం నాగ్‌పూర్‌లోని ఫ్రీడమ్ పార్క్ నుంచి ఖాప్రి వరకు ఏర్పాటైన మెట్రో ఫేజ్-1 ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ రెండు మెట్రో రైళ్లను ప్రారంభించారు. అనంతరం ఈ రైళ్లను జాతికి అంకితం చేశారు.అటు తరువాత మెట్రో ఫేజ్-2కు శంకుస్థాపన చేశారు.జఖాప్రి నుంచి ఆటోమోటివ్ స్క్వేర్ వరకు ప్రయాణించే ఒక రైలును, ప్రజాపతి నగర్ నుంచి లోకమాన్య నగర్ వరకు వెళ్లే మరో రైలును ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మెట్రో స్టేషన్లో టిక్కెట్ కొనుక్కున్న ప్రధాని, కొంతమంది విద్యార్థులతో కలిసి రైలులో ప్రయాణించారు. కళాకారులతో కలసి డోలు వాయించారు.విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పాల్గొన్నారు.
PM Shri @narendramodi takes ride in Nagpur Metro. #MahaSamruddhi https://t.co/VWls5ScEgm
— BJP (@BJP4India) December 11, 2022